Tamilanadu : 238 సార్లు ఓడినా... తగ్గేదేలే... అంటున్న ఎలక్షన్‌ కింగ్‌!

238 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి ఎన్నికల్లో నిలిచేందుకు సిద్దమయ్యాడు తమిళనాడుకు చెందిన ఓ విక్రమార్కుడు. ఆ విక్రమార్కుడు ఎవరూ..అతని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌ చదివేయాల్సిందే.

New Update
Tamilanadu : 238 సార్లు ఓడినా... తగ్గేదేలే... అంటున్న ఎలక్షన్‌ కింగ్‌!

Election King :ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి గురించి ఎవరైనా మాట్లాడుకుంటారు... కానీ ఓడిపోయిన వ్యక్తి గురించి అంత పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడ మాత్రం ఓడిపోయిన వ్యక్తి గురించి ఈరోజు యావత్‌ దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. ఎందుకంటే ఆయనేమి మొదటి సారి ఎన్నికల బరిలో నిలిచి ఓడిపోలేదు.... ఏకంగా 238 సార్లు ఎన్నికల్లో నిల్చుని ఒక్కసారి కూడా గెలవకుండా రికార్డులు క్రియేట్‌ చేశాడు. అయినా సరే ఎక్కడ తగ్గేదేలే అంటూ మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అయిపోయాడు.

అతనే తమిళనాడు(Tamilanadu) కు చెందిన పద్మరాజన్‌(Padma Rajan)...పెద్ద పెద్ద మీసాలు... నుదుటి పై తిలకంతో 65 ఏళ్ల పద్మరాజన్‌ టైర్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. 1988లో తమిళనాడులోని తన సొంత పట్టణం మెట్టూరు నుంచి మొట్టమొదటి సారి ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ ఆయన గెలవలేదు. దీంతో జనాలు నవ్వుకోవడం మొదలెట్టారు.

కానీ ఏమాత్రం నిరాశ పడని పద్మరాజన్‌ ప్రతిసారి ఎన్నిక(Elections) ల్లో పోటీ చేయడం ఓడిపోవడం పరిపాటిగా మారిపోయింది. అలా ఇప్పటి వరకు 238 సార్లు ఎన్నికల్లో ఓడిపోయాడు. అసలు ఇన్ని సార్లు ఓడిపోయినప్పటికీ అతను ఎందుకు మళ్లీ మళ్లీ పోటీ చేస్తున్నాడని అడగగా.. ఓ సామాన్యుడు కూడా ఎన్నికల్లో నిలవగలడని నిరూపించడానికే అని చెప్పుకొచ్చాడు.

ఈసారి లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) పోలింగ్‌ ఏప్రిల్‌ 19 నుంచి ప్రారంభమై ఆరు వారాల పాటు ఎన్నికలు జరగనున్నాయి. పద్మరాజన్ తమిళనాడులోని ధర్మపురి జిల్లా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రజలు ఆయనను 'ఎలక్షన్ కింగ్' అని పిలుస్తారు. స్థానిక ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు ఆయన పోటీ చేశారు.

ఇటీవలి సంవత్సరాలలో, అతను ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi), మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేతిలో ఓడిపోయారు. ఎదుటి అభ్యర్థి ఎవరనేది నాకు పట్టింపు లేదని పద్మరాజన్‌ అంటారు. మూడు దశాబ్దాల్లో నామినేషన్ ఫీజుల పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేశానని అంటున్నారు.

ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా పద్మరాజన్‌ తన పేరు మీద ఓ రికార్డును క్రియేట్‌ చేశాడు. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో తన పేరును ఎక్కించుకున్నాడు.

Also Read : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే…

Advertisment
తాజా కథనాలు