Paris Olympics 2024 : బాక్సర్‌‌ను చితక్కొట్టి బయటకు పంపించిన లింగనిర్ధారణ ఫెయిల్ అయిన కంటెస్టెంట్

పారిస్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో ఆసాధారణ సంఘటన చోటు చేసుకుంది. లింగనిర్ధారణ కానీ ప్రత్యర్ధి ఖెలిఫ్ చేతిలో మహిళా బాక్సర్ ఏంజెలీ కారిని ఓడిపోయింది. అన్యాయంగా జరిగిన ఈ పోటీ మీద ఇప్పుడు పెద్ద వివాదం చెలరేగతోంది. దీంతో ఐ స్టాండ్ కారిని అనేది సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ అవుతోంది.

New Update
Paris Olympics 2024 : బాక్సర్‌‌ను చితక్కొట్టి బయటకు పంపించిన లింగనిర్ధారణ ఫెయిల్ అయిన కంటెస్టెంట్

Women Boxing : పారిస్ ఒలిపింక్స్‌ (Paris Olympics 2024) లో మహిళల 66 కేజీలవిభాగంలో బాక్సింగ్ పోటీలు జరిగాయి. ఇందులో అల్జీరియా (Algeria) కు చెందిన ఇమేన్‌ ఖెలిఫ్‌, ఇటలీకి చెందిన ఏంజెలా కారిని తలపడ్డారు. కేవలం 46 సెకెన్లలోనే ఖెలిఫ్ చేతిలో కెరిని ఓడిపోయింది. ఇంక నేను ఆడలేను అంటూ బౌట్ నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళేటప్పుడు ఆమె ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంది ఎంజిలా నొప్పితో ఏడుస్తూ ఉంది. ఖెలిఫ్‌ పిడిగుద్దుల ధాటికి ఏంజెలా కారిని ముక్కు విరిగినంత పనై, బౌట్‌ నుంచి నిష్క్రమించింది. ఒలిపింక్స్ చరిత్రలోనే ఇల జరగడ్ ఇది మొదటిసారి కేవలం 46 సెకెన్లలో అసలు పోటీ ముగియడమే ఒక వింత.

అసలెందుకిలా జరిగింది...

పోటీ మొదలైన కొద్ది సెకన్లలోనే ఖెలిఫ్ కారిని తన మీ రెండు సార్లు అటాక్ చేసింది. తర్వాత ముక్కును పచ్చడి చేసింది. తర్వాత ముక్కులో తీవ్రమైన నొప్పి రావడం వల్లనే తాను బౌట్ నుంచి వైదొలిగానని కారిని చెప్పింది. గేమ్‌ అనంతరం ఆమె ఖెలిఫ్‌కు కరచాలనం కూడా చేయలేదు. దీని వెనుక బలమైన కారణమే ఉంది.

ఎక్కడైనా ఇద్దరి మధ్య పోటీ జరుగుతోంది అంటే.. అది సేమ్ జెండర్ అయి మాత్రమే ఉండాలి. ముఖ్యంగా ఆ బాక్సింగ్ లాంటి వాటిలో ఈ విషయంపై మరీ పర్టిక్యులర్‌‌గా ఉంటారు. ఎందుకంటే ఆడాళ్ళ కంటే మగవాళ్ళ బలం ఎక్కువగా ఉంటుందనే కారణంతో. అయితే ఇక్కడ కారినితో తలపడిన ఖెలిఫ్ మీద ఇంతకు ముందే ఒక వివాదం ఉంది 2023 వరల్డ్‌ ఛాంపియన్ షిప్‌కు ఆమె అర్హత సాధించలేకపోయింది. దానికి కారణం ఆడ మగ అన్న లింగనిర్దారణ జరగకపోవడమే. మామూలు మహిళా బాక్సర్ల కంటే ఖెలిఫె చాలా బలంగా ఉంటుంది. అయితే అది ఆమె మహిళ కాకపోవడం వల్లనే అంటారు. అప్పుడు అందుకే వరల్డ్‌ ఛాంపియన్ షిప్‌ (World Championship) కు ఎంపిక చేయలేదు. కానీ ఒలింపిక్స్‌లో ఖెలిఫెకు ఇలాంటి ఇబ్బందులు ఏమీ రాలేదు. దాంతో పోటీల్లో పాల్గొంది. ఇప్పుడు ప్రత్యర్ధుల మీద పిడిగుద్దులు కురిపిస్తూ...వాళ్ళ జీవితాలతో ఆడుకుంటోంది.

బాక్సింగ్ లాంటి ఆటల్లో క్రీడాకారులు గాయపడడం చాలా సహజం. అయితే అది అసాధారణంగా..అది కూడా సెకెన్ల వ్యవధిలోనే జరగదు. ఒకవేళ అలా జరిగింది అంటే అక్కడ ఏదో తేడా ఉందనే అర్ధం. ఇప్పుడు ఏంజిఆ కారిని విషయంలో కూడా అదే జరిగింది అంటున్నారు. కారిని విషయంలో అన్యాయం రిగిందని ఆరోపిస్తున్నారు. లిఫ్‌ వివాదాల నడుమ పారిస్‌ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లోనే ప్రత్యర్ధిని తీవ్రంగా గాయపరిచి మ్యాచ్‌ను గెలిచింది. మగ లక్షణాలున్న బాక్సర్‌ చేతిలో ఓటమిపాలైన కారిని మీద అందరూ సానుభూతి చూపిస్తున్నారు. ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని అంటున్నారు. దాని కోసం ఐ సపోర్ట్ కారిని అంటూ సోషల్ మీడియా (Social Media) లో హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ విషయం ఎంతవరకు వెళుతుందో...అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read : శ్రీలంకతో టీమిండియా మొదటి వన్డే ఈరోజు.. ఏడేళ్ల తరువాత మొదటిసారి అలా!

Advertisment
Advertisment
తాజా కథనాలు