Women reservation bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై డౌట్స్‌ ఉన్నాయా? అయితే ఇక్కడ క్లారిఫై చేసుకోండి!

మహిళలకు ఏయే సీట్లు రిజర్వ్ చేయాలో ఎలా నిర్ణయిస్తారు? మహిళా రిజర్వేషన్ ఎప్పటి వరుకు ఉంటుంది? SC-ST మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ లభిస్తుందా? లాంటి ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ సమాధానలు చెబుతున్నారు నిపుణులు. ఈ బిల్లులో OBC మహిళలకు ప్రత్యేక కేటాయింపు లేదంటున్నారు. ఒక్కసారి లోక్‌సభ, అసెంబ్లీల్లో ఈ చట్టం అమల్లోకి వస్తే 15 ఏళ్లపాటు అమల్లో ఉంటుందంటున్నారు.

New Update
Women reservation bill:  మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై డౌట్స్‌ ఉన్నాయా? అయితే ఇక్కడ క్లారిఫై చేసుకోండి!

Women reservation questions and answers: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే లోక్‌సభలో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. రేపో.. మాపో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడుతుంది. అయితే మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జనరల్‌ ఎలక్షన్స్‌ జరగనున్నాయి. మరి ఈ ఎన్నికలతోనే ఈ బిల్లు అమల్లోకి వస్తుందా? లేదా మరింత టైమ్‌ పడుతుందా? అసలు ప్రాసెస్ ఏంటి? 33శాతం మంది మహిళా ప్రజాప్రతినిధులు కేవలం లోక్‌సభలోనే అడుగుపెడతారా? రాజ్యసభలోనూ ఈ 33శాతం కోటా ఉంటుందా? రాష్ట్ర అసెంబ్లీల సంగతేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్నాయా? అయితే మీ కోసమే ఈ క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్‌.. ఓ సారి లుక్కేయండి!

రిజర్వేషన్ కోసం ప్రవేశపెట్టిన బిల్లు పేరు ఏమిటి?

మహిళా రిజర్వేషన్ కోసం ప్రవేశపెట్టిన బిల్లు పేరు '128వ రాజ్యాంగ సవరణ బిల్లు 2023', దీనికి మోదీ ప్రభుత్వం 'నారీ శక్తి వందన్ బిల్లు' అని పేరు పెట్టింది. ఈ బిల్లు లోక్‌సభ, 31 అసెంబ్లీలలో 33శాతం స్థానాలు మహిళలకు రిజర్వ్ చేస్తుంది. అంటే లోక్‌సభలో 543 సీట్లు ఉంటే అందులో 181 స్థానాలు మహిళలకే దక్కుతాయి. మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేయవచ్చు

పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే, అన్ని రాష్ట్రాల శాసనసభల్లో కూడా అమలు చేస్తారా?

అవును.. అమలు చేయాలి.. కానీ అది మరొక ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి లోక్‌సభ, రాజ్యసభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అసెంబ్లీ స్థానాల్లో మార్పు ఉంటుంది కాబట్టి.. సగానికి పైగా రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం. అన్ని రాష్ట్రాల శాసనసభలు ప్రభావితమైతే, ఆ రాష్ట్ర శాసనసభ కూడా తమ అంగీకారం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవచ్చు.

రాజ్యసభ, శాసన మండలిలో కూడా ఈ రిజర్వేషన్ వర్తిస్తుందా?

లేదు.. ఈ చట్టం రాజ్యసభతో పాటు మొత్తం 6 శాసన మండలిలో వర్తించదు. ఈ బిల్లులో లోక్‌సభ, అసెంబ్లీలు, ఢిల్లీ ఎన్‌సీటీ(NCT) ఉన్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే ఇది వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నారు. శాసన మండలి, రాజ్యసభ ప్రతినిధులను నేరుగా ప్రజలు ఎన్నుకోరు కదా.

రాబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. 2024 లోక్ సభ ఎన్నికలలో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేస్తారా?

నారీ శక్తి వందన్ బిల్లు ప్రకారం, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు డీలిమిటేషన్ తర్వాత మాత్రమే అమలు చేస్తారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత మొదటి జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరుగుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జనాభా లెక్కలు, డీలిమిటేషన్ నిర్వహించడం దాదాపు అసాధ్యమని నిపుణుల అభిప్రాయం. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సకాలంలో జరిగితే ఈసారి రిజర్వేషన్లు అమలు కాబోవని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.

మహిళా రిజర్వేషన్ ఎప్పటి వరుకు ఉంటుంది?

ఒక్కసారి లోక్‌సభ, అసెంబ్లీల్లో ఈ చట్టం అమల్లోకి వస్తే 15 ఏళ్లపాటు అమల్లో ఉంటుంది. అంతకుమించి రిజర్వేషన్లు కొనసాగించాలంటే ఇప్పుడున్న విధానాల ప్రకారం మళ్లీ బిల్లు తీసుకొచ్చి ఆమోదించాల్సి ఉంటుంది. 15 ఏళ్లు దాటినా అప్పటి ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకురాకపోతే ఆటోమేటిక్‌గా ఈ చట్టం ముగిసిపోతుంది.

SC-ST మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ లభిస్తుందా?

SC-ST మహిళలకు రిజర్వేషన్ SC-ST కోటా నుంచి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభలో SC-STలకు రిజర్వ్ చేసిన సీట్ల సంఖ్య 131. మహిళా రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన తర్వాత, వీటిలో మూడింట ఒక వంతు అంటే 44 సీట్లు SC-ST మహిళలకు రిజర్వ్ చేస్తారు. మిగిలిన 87 స్థానాల్లో పురుషులు, మహిళల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు.

OBC మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ లభిస్తుందా?
ఈ బిల్లులో OBC మహిళలకు ప్రత్యేక కేటాయింపు లేదు.

మహిళలకు ఏయే సీట్లు రిజర్వ్ చేయాలో ఎలా నిర్ణయిస్తారు?

దీనికి మూడు దశలు ఉంటాయి. ముందుగా ఈ బిల్లును ఆమోదిస్తారు. తర్వాత జనాభా గణన, ఆపై డీలిమిటేషన్ ఉంటుంది. డీలిమిటేషన్ తర్వాత మహిళలకు ఏ సీటు రిజర్వ్ చేయాలనేది నిర్ణయిస్తారు. సీట్ల ఎంపిక యాదృచ్ఛికంగా ఉంటుంది. మహిళల జనాభా ఆధారంగా కూడా ఉంటుంది. చాలా సీట్లలో పురుషులు, స్త్రీల నిష్పత్తి దాదాపు సమానంగా ఉంటారు. రిజర్వ్ చేసిన సీట్లను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ రొటేషన్ పద్ధతిలో జరుగుతుంది. ప్రస్తుతం లోక్‌సభలో 543 సీట్లు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత వీటిలో మూడో వంతు అంటే 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు. రొటేషన్ విధానాన్ని అనుసరిస్తే వచ్చే ప్రతి ఎన్నికల్లో 181 సీట్లు మారుతాయి. అంటే 181 మంది మహిళా ఎంపీల టిక్కెట్లు రద్దవుతాయి లేదా వారు ప్రస్తుత స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయలేరు. అదేవిధంగా గత ఎన్నికల్లో 362 అన్‌రిజర్వ్‌డ్ స్థానాల్లో 181 మంది ఎంపీలు ఎన్నికల్లో పోటీ చేయడం లేదా వారి సీట్లు మారడం ఖాయం. అంటే ప్రతి ఎన్నికల్లోనూ 362 మంది ఎంపీల టిక్కెట్లు రద్దవుతాయి లేదా సీట్లు మారతాయి.

మహిళలకు రిజర్వు చేసిన స్థానాల్లో ఒక మహిళ ఒకటి కంటే ఎక్కువ చోట్ల పోటీ చేయవచ్చా?

ఒక మహిళ రిజర్వ్‌డ్ స్థానం నుంచి పోటీ చేస్తే, ఆమె మరొ మహిళ రిజర్వ్‌డ్ స్థానం నుంచి పోటీ చేయలేరు.

①○ రిజర్వేషన్ బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత, మహిళలు రిజర్వ్‌డ్ స్థానాల నుంచి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగలరా?

543 లోక్‌సభ స్థానాల్లో 181 స్థానాల్లో మహిళలు మాత్రమే పోటీ చేస్తారు. అన్ని వర్గాలకు చెందిన మహిళలు ఇప్పుడు లాగానే మిగిలిన స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారు. అంటే మిగతావి ఓపెన్‌ కేటగిరి కిందకి వస్తాయి.. అక్కడ ఎవరైనా పోటి చేయవచ్చు.

ALSO READ: ఇన్ని సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఆగిపోయింది..?

Advertisment
తాజా కథనాలు