/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Periods.jpg)
Beauty Tips: ఆడవారికి వచ్చే సమస్యల్లో పీరియడ్స్ ఒకటి. ప్రతి నెలలో పీరియడ్స్ ఐదు రోజులు స్త్రీలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అంతేకాదు ఆ సమయంలో ఆహారంపై, చర్మంపై జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న చర్మ సంబంధిత సమస్యలు వస్తూనే ఉంటాయి. పీరియడ్స్ సమయంలో చర్మ సంబంధిత సమస్యలు ఉంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం, పానీయాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారట. పీరియడ్స్ సమయంలో హార్మోన్లు మారుతాయి. దీనివలన మొటిమలు వస్తాయి. మరి పీరియడ్స్ సమయంలో ఈ సమస్యలు రాకుండా ఏం చేయాలో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
పీరియడ్స్ సమయంలో చర్మ సమస్యలు రాకుండా జాగ్రత్తలు:
- పీరియడ్స్ సమయంలో చర్మ సమస్యలను నివారించడానికి కొన్ని విషయాలను నివారించవచ్చు. జంక్‌ఫుడ్ ఎక్కువ నూనె, ఉప్పు, ప్రాసెస్డ్ షుగర్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను పాడుచేసి చర్మ సమస్యలకు దారితీస్తాయి. అందుకే వీటికి దూరంగా ఉంటే మంచిది.
- ఎక్కువ చక్కెర తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది మొటిమలకు దారితీస్తుంది. స్వీట్లు తినాలని అనిపిస్తే పీరియడ్స్ సమయంలో పండ్లు తినవచ్చు.
- కెఫీన్ డీహైడ్రేషన్ శరీరంలో వాపు, అనేక చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అలాంటి సమయంలో హెర్బల్ టీ, నీరు తాగితే మంచిది.
- పీరియడ్స్ సమయంలో చాలా స్పైసీ ఫుడ్ తినవద్దు. ఎందుకంటే ఇది మొటిమలు, స్కిన్ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. తేలికపాటి, పోషకమైన ఆహారాన్ని తింటే ఆరోగ్యానికి, చర్మానికి మంచిది.
- పీరియడ్స్ సమయంలో ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండాలి. దీని కారణంగా చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.