వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న కొందరు మహిళలు హెచ్‌ఐవీ బారిన పడినట్లు ఇటీవల కొన్ని కేసులు బయటకు వచ్చాయి. న్యూ మెక్సికోలోని లైసెన్స్ లేని స్పాలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు కూడా హెచ్‌ఐవీ బారిన పడినట్లు అధికారులు గుర్తించారు.ఈ హెచ్‌ఐవీకి చికిత్స చేయకపోతే అది ఎయిడ్స్ గా మారే ప్రమాదం ఉంది.
ఈ విషయాన్ని యూఎస్ ఆరోగ్య సంస్థ, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదికలో వివరించింది. వైద్య , సౌందర్య సేవలను అందించే అనియంత్రిత సంస్థలతో ముడిపడి ఉన్న తీవ్రమైన ప్రమాదాలను గురించి పేర్కొంది. సరైన లైసెన్సులు లేకుండా ఆపరేట్ చేసినందుకు, సురక్షితమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులను పాటించడంలో విఫలమైనందుకు ఆ స్పా ని 2018 లోనే మూసి వేశారు.
లైసెన్స్ లేకుండా మెడిసిన్ ప్రాక్టీస్ చేసినందుకు దాని యజమాని ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.
స్పాలో వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న తర్వాత 2018లో ఒక మాజీ క్లయింట్ HIVకి పాజిటివ్ గా వచ్చింది. దీంతో అసలు ఆమెకు ఎలా ఈ వ్యాధి సోకింది అని తెలుసుకోవడం ప్రారంభించిన క్రమంలో ఆమె స్పా లో వాంపైర్ ఫేషియల్ చేయించుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన , ఆ ఫేషియల్ కు సంబంధించిన ఉపయోగించిన అన్ని పరికరాలను పదేపదే ఉపయోగించడం వల్ల ఇలా ఒకరి నుంచి మరొకరికి హెచ్‌ఐవీ వచ్చినట్లు తెలుస్తుంది.
స్పా నిర్వహకులు కలుషితమైన సూదులు పదే పదే తిరిగి ఉపయోగించడం వల్ల దానికి ఉన్న రక్తం ద్వారా హెచ్‌ఐవీ ఇతరుల శరీరాల్లోకి చేరుతుందని అధికారులు గుర్తించారు. కొందరు అయితే స్పా ని సందర్శించిన కొద్ది సేపటికే హెచ్‌ఐవీ పాజిటివ్ పరీక్షను చేయించుకున్నారు. దీంతో అధికారులు పాత ఖాతాదారులందరినీ కూడా ఈ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. దాదాపు 200 మంది క్లయింట్లు, వారి భాగస్వాములలో పరీక్షలు చేయించుకున్న వారి మధ్య అదనపు కేసులు ఏవీ గుర్తించలేదు.
వాంపైర్ ఫేషియల్‌లు సాధారణంగా తక్కువ-ప్రమాదకరంగా పరిగణించబడుతున్నప్పటికీ, ఈ కేసు కొత్త, స్టెరైల్ సూదులు, పరికరాలను ఉపయోగించడంతో సహా సరైన పరిశుభ్రత ప్రోటోకాల్‌లను కచ్చితంగా పాటించాలని వివరించింది. "కాస్మెటిక్ ఇంజెక్షన్ సేవలను అందించే స్పా సౌకర్యాల వద్ద తగిన ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులు అవసరం అని అధికారులు పేర్కొన్నారు.