పశ్చిమ బెంగాల్ లో మహిళలకు రక్షణ లేదు..జే.పీ నడ్డా!

పశ్చిమ బెంగాల్‌లో మహిళలకు భద్రత లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా ఆరోపించారు.దినాజ్‌పూర్ జిల్లాలోని చోప్రా ప్రాంతంలోని  కాంగ్రెస్ నాయకుడు ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులను రహదారి పై కొట్టడమే ఇందుకు నిదర్శనమని నడ్డా ఎక్స్ లో పోస్ట్ చేశారు.

పశ్చిమ బెంగాల్ లో మహిళలకు రక్షణ లేదు..జే.పీ నడ్డా!
New Update

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది.అయితే ఆ పార్టీ ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని చోప్రా ప్రాంతంలోని  కాంగ్రెస్ నాయకుడు ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులను బహిరంగంగా రహదారి పై కొట్టడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీనికి సంబంధించి కేంద్ర మంత్రి జేపీ నడ్డా X సోషల్ మీడియాలో పోస్టే చేశారు. పశ్చిమ బెంగాల్‌లో  ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు రోడ్డు మధ్యలో దాడి చేసిన ఘటన నన్ను చాలా బాధపెట్టింది. అక్కడ మహిళలపై జరుగుతున్న అకృత్యాలు పూర్తి బాధ్యత తృణముల్ కాంగ్రెస్ వాళ్లది.వారి పై దాడులు జరుగుతున్న సీఎం మమతా బెనర్జీ స్పందించకపోవటమే తెలుస్తోంది.అంటూ నడ్డా పోస్ట్ చేశారు.

#jp-nadda #west-bengal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe