AP News: ఉప ముఖ్యమంత్రి పవన్‌కు (Pawan Kalyan) మరో పరిక్ష ఎదురైంది. ఆయన ఇలాకాలోనే మరో మహిళ మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. రెండున్నర ఏళ్లుగా తన కూతురు కనిపించట్లేదని, పోలీసులు ఎవరు పట్టించుకోలేదంటూ తల్లి కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. పవన్ కల్యాణ్ తనకు న్యాయం చేయాలని కోరింది.
రాత్రి ఫోన్ మాట్లాడి తెల్లవారేసరికి..
ఈ మేరకు పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన దోడ్డి వరలక్ష్మీ కుమార్తె వీరమణి. రెండున్నర సంవత్సరాల క్రితం తప్పిపోయిన ఆమె ఆచూకీ ఇంతవరకూ లభ్యం కాలేదు. 6 ఏళ్ల క్రితం కాకినాడ జగన్నాధపురానికి చెందిన వ్యక్తితో వీరమణీకి వివాహం జరగగా ఇద్దరు పిల్లల సంతానం. అయితే అత్తింటివారు వీరమణిని తరచూ వేదింపులకు గురిచేసేవారని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఆ రోజు రాత్రి మాట్లాడిన తన బిడ్డ తెల్లవారేసరికి ఏమైందో తెలియకుండా పోయిందని వరలక్ష్మి కన్నీరుమున్నీరైంది. బిడ్డ ఏమైందని అడిగినా అత్తింటివారు సరైనా సమాధానం చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొంది.
ఈ విషయంపై రెండు సంవత్సరాలక్రితం కాకినాడలో పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తల్లి వరలక్ష్మి ఆవేదన చెందింది. మా ఎమ్మెల్యే పవన్ న్యాయం చేస్తారని ఆశతో వచ్చామని తెలిపింది. ఇటివలే ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రమేయంతో భీమవరానికి చెందిన తేజస్వీని ఆచూకీ లభ్యం కావడంతో.. బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆ అమ్మాయి కోసం సహాయం చేసినట్లే.. మా అమ్మాయిల ఆచూకీ కోసం పవన్ న్యాయం చేస్తారని కోరుతున్నారు.
Also Read: రూ.500, 200 నోట్ల రద్దు.. హింట్ ఇచ్చేసిన చంద్రబాబు!