Accident : రద్దీగా ఉన్న మార్కెట్లోకి దూసుకొచ్చిన కారు.. మహిళ మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు!

మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి ఓ మహిళ మృతికి కారణమయ్యాడు. ఈ ప్రమాదం ఢిల్లీలో జరిగింది. 15 మంది తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

New Update
Accident : రద్దీగా ఉన్న మార్కెట్లోకి దూసుకొచ్చిన కారు.. మహిళ మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు!

Delhi : ఢిల్లీ(Delhi) లోని ఘాజీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ కారు అతివేగంతో ప్రజల మీదకు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించగా..15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బుధవారం రాత్రి రద్దీగా ఉన్న మార్కెట్లోకి కారు అతి వేగంతో దూసుకురావడం సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. కారు(Car Accident) ప్రజల మీదకు దూసుకువచ్చిన సమయంలో కొంత తొక్కిసలాట కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే విషయం తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు(Medical Tests) నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ఐదుగురు మహిళలతో సహా గాయపడిన వారందరినీ లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో ఘజియాబాద్‌లోని హయత్ నగర్ పాత ఖోడా కాలనీకి చెందిన సీతాదేవి అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.

కేసు దర్యాప్తు కొనసాగుతోంది
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) అపూర్వ గుప్తా(Apoorva Gupta) మాట్లాడుతూ, “మొత్తం తీవ్రంగా గాయపడిన15 మందిని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రిలో చేర్చారు. వారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.'' పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన వారిలో ఒకరు ఘజియాబాద్‌కు చెందిన సీతాదేవిగా గుర్తించారు. "నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడు. చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము" అని అధికారి తెలిపారు.

Also Read : మరో 9 మంది అభ్యర్థులకు పచ్చ జెండా ఊపిన పవన్!

Advertisment
తాజా కథనాలు