/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/International-Mens-Day-2023-jpg.webp)
ఇది మీకు తెలుసా? మహిళలకు ఒక రోజు ఉన్నట్లుగానే..పురుషులకు కూడా ఒక రోజు ఉంది. ప్రపంచంలో ప్రతిఏటా నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటారు. మరి ...ఈ రోజును ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? దీనికి కారణాలేంటీ? అలాంటి విషయాలను పురుషులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు అవసరమైన సందేశాలను ఇప్పుడు చూద్దాం.
మగవాళ్లు తన జీవితంలో ఎన్నో రకాల పాత్రలు పోషిస్తారు. కానీ మహిళలకు లభించేంత గుర్తింపు వీరికి ఉండదు. ఎందుకంటే వీరు మహిళల కంటే బలమైనవారనే భావన అందరిలో ఉండటం వల్లే. ప్రపంచంలో పురుషుల ఆధిపత్యమే నడుస్తుందని అనుకుంటారు. నాన్న, తమ్ముడు, భర్త, కొడుకు ఇలా ఆడవారి జీవితంలో అనేక బంధాలతో మగవారు భాగమవుతారు. కుటుంబాన్ని నడిపే బాధ్యతలను కూడా తమ భుజాలపై వేసుకుంటారు. తాము కాలిపోతున్నా..వెలుగునిచ్చే సమిధలా, కంటిని కాపాడే కనుపాపలా పిల్లల బాగోగులు చూస్తారు.
ఐక్యరాజ్యసమితి ఆమోదంతో 1999లో తొలిసారిగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరిగింది. అప్పటి నుంచి నవంబర్ 19న ఈ వేడుకలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఇండియాతోపాటు ఉత్తర, అమెరికా, ఆసియా, యూరప్ , కరేబీయన్ దీవులు, ఆఫ్రికాతోపాటు 60దేశాల్లో పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి పురుషులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు చెబుదామా?
1. వీలైతే భర్తకు బంగారం కొనివ్వండి లేదంటే వారిని బంగారంలా చూసుకోండి.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు
2. పురుషుల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యల పట్ల మన దేశంలో చూపే శ్రద్ధ శూన్యం.. ఇకనైనా దీనిపై దృష్టిపెట్టండి.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు
3. స్త్రీ, అమ్మగా.. ప్రాణం పోస్తే...
పురుషుడు, నాన్నగా ఆ ప్రాణానికి ఓ రూపునిస్తాడు.
వ్యక్తిగతంగా ఉన్నత స్థాయికి తీసుకువస్తాడు.
ప్రతి విజయంలో వెనుకే ఉంటాడు.
బాధలోనైనా నేనున్నాననే ఆసరా ఇస్తాడు.
- అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు
4. ఇంట్లో బాధలు.. ఆఫీసులో బోలెడన్ని లక్ష్యాలు..
బుర్రను ఎన్ని సమస్యలు తొలచివేస్తున్నా...
చిరునవ్వుతో సవాళ్లను స్వీకరిస్తాడు పురుషుడు
- అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు
5. గెలిచినప్పుడు ఆనందంగా పదిమందికి చెప్పుకుంటాడు..
ఓడినప్పుడు మన భుజంతట్టి..
గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి నాన్న ఒక్కడే.
- అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు
6. ఓర్పుకు మారు పేరు..
మార్పుకు మార్గదర్శి..
- అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు
7. Men are a beautiful creation of God, but they are not perfect, so it’s normal that they have several errors.
- Happy International Men’s Day!
ఇది కూడా చదవండి: పీవీ సింధుకు కొత్త కోచ్ ..ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ తండ్రి…!!