Winter Health: శీతాకాలం..గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి ఇలా.. 

శీతాకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ముఖ్యంగా గుండె విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత శారీరక శ్రమ, డీ విటమిన్ లోపం లేకుండా చూసుకోవడం వంటివి గుండె పదిలంగా ఉంచుకోవడంలో సహాయపడుతుంది. 

Winter Health: ఈ తప్పులు చలికాలంలో మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి 
New Update

Winter Health:  శీతాకాలం మొదలైంది. ఇప్పుడు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలు ఎదురవుతాయి. సాధారణ జలుబు మొదలుకుని.. ఊపిరితిత్తుల సమస్యల వరకూ చాలా ఇబ్బందులు శీతాకాలంలో మనల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది జలుబు, దగ్గు వంటి వాటితో కష్టపడుతున్నారు. అందుకే ఇప్పుడు  తినడం లేదా తాగటం వంటి విషయాల్లో ఏ విధమైన నిర్లక్ష్యం చేయడం సరికాదు. చలికాలంలో చురుగ్గా ఉండటం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది రక్త ప్రసరణను కూడా బాగా ఉంచుతుంది.  గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.

శీతాకాలంలో(Winter Health)గుండెకు సంబంధించి కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే, మన ఇంట్లోని వృద్ధుల గురించి చూస్తే కనుక వారికి పెద్దగా శారీరక శ్రమ చేయడం కుదరదు. మన జీవనశైలి - ఆహారం గుండె ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని, శీతాకాలంలో మీ గుండెను ఆరోగ్యంగా ఉంచే కొన్ని సులభమైన ఆరోగ్య చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

బీపీ చెక్ చేసుకోవడం.. 

అధిక బీపీ అంటే రక్తపోటు ప్రతి ఇంటిలోనూ చాలామంది సమస్యగా మారింది. చాలా సందర్భాలలో, దీనిని అంత త్వరగా గుర్తించలేం. దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. బీపీ పెరగడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అందువల్ల, మీరు మీ రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. 

Also Read: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ నూనెలతో హెడ్‌ మసాజ్‌ ట్రై చేయండి

విటమిన్ డి లోపం.. 

విటమిన్ డి లోపం గుండె పనితీరును కూడా ప్రభావితం చేస్తుందని చాలామందికి తెలీదు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఎముకలు - కండరాలకువిటమిన్ డి చాలా ముఖ్యమైనది. శరీరంలో దాని లోపం కారణంగా, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. సూర్యరశ్మి విటమిన్ డి ని అందించే గొప్ప మూలంగా చెప్పవచ్చు. చలికాలంలో ఎప్పటికప్పుడు విటమిన్ డి పరీక్షలు చేయించుకోవడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. 

నీళ్లు తాగడం.. 

సాధారణంగా చలికాలంలో చాలా మంది తాగే నీటిని తగ్గిస్తారు. అయితే ఈ సీజన్ లో మీ శరీరానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడం కోసం క్రమం తప్పకుండా నీరు తాగడం కూడా ముఖ్యం. అలాగే తాజా ఆహారాన్ని తీసుకోవాలి. నిల్వ ఉన్న ఆహార పదార్ధాలను ఎవాయిడ్ చేయడం మంచిది. అంతేకాదు.. ఫ్రిజ్ లో ఉన్న ఆహారాన్ని తినాలంటే.. ముందుగా వాటిని బయట గది ఉష్ణోగ్రత వద్ద కొద్దిసేపు ఉంచి తరువాత తినడం మంచిది. 

శీతాకాలంలో గుండె విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండడం మంచిది. మరీ చల్లగా ఉన్న ప్రాంతాల్లో ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం.. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. 

Watch this interesting Video:

#heart-health #winter
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe