Motivation: ఈ గెలుపు సూత్రాలు పాటిస్తే విజయం మీదే.. రాసి పెట్టుకోండి!

కెరీర్‌లో విజయం సాధించడానికి ముందుగా ఓవర్‌టైమ్‌కి 'నో' చెప్పాలి. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉత్పాదకత పెరగదు.. తగ్గుతుంది..! ప్రతిరోజూ ఓవర్‌టైమ్ చేస్తే మీరు మరింత అలసిపోతారు. ఇక డిజిటల్‌ గ్యాడ్జెట్స్‌కు వీలైనంతగా దూరంగా ఉండండి.

New Update
Motivation: ఈ గెలుపు సూత్రాలు పాటిస్తే విజయం మీదే.. రాసి పెట్టుకోండి!

క్రికెట్‌లో గెలుపునకు, ఓటముకు కొన్నిసార్లు కేవలం ఒక్క పరుగే తేడా ఉంటుంది. లైఫ్‌ కూడా అంతే..! అయితే హార్డ్‌వర్క్‌తో పాటు స్మార్ట్‌ వర్క్‌ను నమ్ముకోవడం కూడా నేర్చుకోవాలి. పరిస్థితిగా తగ్గట్టుగా స్వీచ్‌ అవ్వాలి.. టైమ్‌ చూసి గేర్స్‌ ఛేంజ్ చేయాలి. అయితే అతిగా కష్టపడొద్దు.. లైఫ్‌లో హ్యాపీనెస్‌ అన్నది అన్నిటికంటే ముఖ్యం. ఆనందంతో కూడిన కెరీర్‌ అంతకంటే అవసరం. రెండిటిని బ్యాలెన్స్‌ చేస్తూ లైఫ్‌ లీడ్‌ చేయడం తెలుసుకోగలగాలి. జీవితంలో విజయానికి కొన్ని గెలుపు సూత్రాలను తెలుసుకోండి.

Also Read: ఈ టిప్స్‌ పాటిస్తే వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపిస్తారు..!

ఓవర్‌ టైమ్‌ వద్దు.. సంబంధాలు మస్ట్:
ఓవర్‌టైమ్‌కి 'నో' చెప్పండి. విజయవంతమైన వ్యక్తి ఎప్పుడూ అలసిపోయేంత పని చేయడు. వారంలో 40 గంటల కంటే ఎక్కువ పని చేయడం ఓవర్‌టైమ్‌గా పరిగణించబడుతుంది. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉత్పాదకత తగ్గుతుంది. ఎక్కువ టైమ్‌ వర్క్‌ చేస్తే ప్రొడక్టవిటీ పెరుగుతుందన్నది నిజం కాదు. రెస్ట్‌ లేకుండా పని చేయడం మీ వర్క్‌ సామర్థ్యంపై నెగిటివ్‌గా ప్రభావం చూపిస్తుంది. ప్రతిరోజూ ఓవర్‌టైమ్ చేస్తే మీరు మరింత అలసిపోతారు. అటు విజయాల్లో సంబంధాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సానుకూల సంబంధం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విజయవంతమైన వ్యక్తి ఎప్పుడూ సంబంధాలను విస్మరించడు.

పదేపదే డిజిటల్‌ పరికరాలు ఉపయోగించవద్దు:
డిజిటల్ డిటాక్స్ మస్ట్. డిజిటల్‌ గ్యాడ్జెట్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. స్మార్ట్‌ ఫోన్లు జీవితంలో భాగమైపోయాయి. అయితే రోజులో కాసేపైనా ఫోన్‌కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మెలుకోని ఉన్న సమయంలో విజయవంతమైన వ్యక్తి ఫోన్‌ లేదా ఇతర గాడ్జెట్స్‌కు కనీసం రోజుకు 3 గంటలు దూరంగా ఉంటాడు. ఇక అలసిపోయినప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఒక వ్యక్తి ప్రతిరోజూ అనేక నిర్ణయాలు తీసుకుంటాడు. అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోకూడదు. ఇటు ఏం చేయాలన్న ప్లాన్‌ అన్నది ముఖ్యం. ఉదయం లేవగానే ఎలాంటి ప్రణాళిక లేకుండా, దిశ లేకుండా, మరుసటి రోజు ఎలా గడపాలో నిర్ణయించుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోలేరు. కాబట్టి ఈ విషయాలన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి.

Also Read: ఉదయం గోరువెచ్చని నీళ్లు తాగుతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు గమనించాల్సిందే..!!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు