Wines Closed: బోనాల పండుగ వేళ మందు బాబులకు షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. లాల్ దర్వాజా మహంకాళి బోనాల నేపథ్యంలో హైదరాబాద్ లో (Hyderabad) 48 గంటల పాటు మద్యం షాపులు మూసి వేయాలని (Wines Closed) అధికారులు ఆదేశించారు. పాతబస్తీతో పాటు మరి కొన్ని చోట్ల ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 30న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి. మరోవైపు సైబరాబాద్ పరిధిలో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించారు. ఎవరైనా ఇచ్చిన ఆదేశాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Wines Closed: నేడు, రేపు వైన్స్ బంద్
TG: మందు బాబులకు చేదువార్త. లాల్ దర్వాజా మహంకాళి బోనాల నేపథ్యంలో హైదరాబాద్ లో 48 గంటల పాటు మద్యం షాపులు మూసి వేయాలని అధికారులు ఆదేశించారు. కాగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 30న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి.
Translate this News: