తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) సంబురం ఫుల్ జోరుగా సాగుతున్న వేళ...తెలంగాణలో మందుబాబులకు కిక్క్ దించే వార్త వినిపించారు అధికారులు . తెలంగాణ రాష్ట్రం మొత్తం 3 రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. 2023 నవంబర్ 28వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు రాష్ట్రం మొత్తం వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
అయితే దీనికి కారణం కూడా ఉంది. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే 28,29, 30 వ తేదీల్లో మూడు రోజులు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు లైసెన్స్ దారులకు స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్లను ప్రభావితం చేయకుండా చూసేంుదకు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఎవరైనా ఉల్లఘింస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: సీటెట్ 2024 జనవరి సెషన్ నోటిఫికేషన్ రిలీజ్..ఇలా దరఖాస్తు చేసుకోండి..!!
కాగా తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు రిలీజ్ కానున్నాయి. నవంబర్ 3న గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నవంబర్ 10 వరకు ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలనను చేపట్టనున్నారు. 15వ తేదీన విత్ డ్రాకు చివరి తేదీగా నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. అందరికీ కార్లు.. ఆఫీస్ బాయ్‌కి కూడా!