Wines shop siege: నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో వైన్స్‌ షాప్ సీజ్

కల్తీ మద్యం తయారు చేసి వైన్స్ షాప్‌లో అమ్ముతున్న ఘటన నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని కల్వకోల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. పక్కా సమాచారంతో వైన్స్ షాప్‌ యజమాని ఇంటిపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేయగా.. వైన్స్‌ షాప్ యజమాని రాజేష్‌ ఇంట్లో 97 నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ పోలీసులు తెలిపారు.

New Update
Wines shop siege: నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో వైన్స్‌ షాప్ సీజ్

కల్తీ మద్యం తయారు చేసి వైన్స్ షాప్‌లో అమ్ముతున్న ఘటన నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని కల్వకోల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. పక్కా సమాచారంతో వైన్స్ షాప్‌ యజమాని ఇంటిపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేయగా.. వైన్స్‌ షాప్ యజమాని రాజేష్‌ ఇంట్లో 97 నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ పోలీసులు తెలిపారు. రాజేష్‌ తన వైన్స్‌ షాప్‌కు తీసుకొస్తున్న మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా తన ఇంటికి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

వైన్స్‌ షాప్‌ యాజమాని తాను తీసుకువెళ్లిన మందుబాటిళ్ల సీల్‌ను తీసి బాటిళ్లలోని సగం మద్యాన్ని తీసి మద్యానికి బదులు నీళ్లు కలిపి మళ్లీ సీల్‌ వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వీటిని తన వైన్స్‌ షాప్‌ ద్వారా విక్రయిస్తూ అధిక లాభం పొందాలని చూసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఆ వైన్స్‌ షాప్‌లో మద్యాన్ని కొనుగోలు చేసిన వారు మద్యం కల్తీ అయినట్లు గుర్తించారు.

దీంతో మద్యం బాబులు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రాజేష్‌ తన షాప్‌కు మద్యాన్ని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నాడానే దానిపై దృష్టి పెట్టారు. మద్యం బాటిళ్లను తన ఇంటి నుంచి తీసుకువస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. రాజేష్‌ కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న సమయంలోనే తన ఇంటిపై దాడి చేశారు. దీంతో వైన్స్ షాప్‌ యజమాని కక్కుర్తి వ్యాపారం బట్టబయలేంది. రాజేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతను నిర్వహిస్తున్న వైన్స్‌ షాప్‌ను సీజ్‌ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు