Wines shop siege: నాగర్ కర్నూల్ జిల్లాలో వైన్స్ షాప్ సీజ్
కల్తీ మద్యం తయారు చేసి వైన్స్ షాప్లో అమ్ముతున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని కల్వకోల్ గ్రామంలో చోటు చేసుకుంది. పక్కా సమాచారంతో వైన్స్ షాప్ యజమాని ఇంటిపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేయగా.. వైన్స్ షాప్ యజమాని రాజేష్ ఇంట్లో 97 నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ పోలీసులు తెలిపారు.