/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Windows-crashed.jpg)
Microsoft Windows Crashed: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలు నిలిచిపోయాయి. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు రీస్టార్ట్ అవుతూ బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తోంది. దీని కారణంగా ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విమాన సేవలు, బ్యాంకు సేవలు స్తంభించాయి. విండోస్​ పనిచేయడం లేదని సోషల్​ మీడియాలో పోస్ట్​లు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈరోజు ఉదయం నుంచి ఈ సమస్యను ఎదురుకుంటున్నట్లు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య కారణంగా అమెరికాతో పాటు వివిధ దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి.
మైక్రోసాఫ్ట్ దెబ్బతో..
◆ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్ డౌన్.
◆ అజూర్ ప్లాట్‌ఫారమ్ అంతరాయాలను ఎదుర్కొంటోంది.
◆ విమాన కార్యకలాపాలు, ఆసుపత్రులు, బ్యాంకులపై ప్రభావం.
◆ విమానాశ్రయం బయలుదేరడం మరియు రాకపోకలు ప్రభావితమయ్యాయి.
◆ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నివేదికలు ప్రభావితమయ్యాయి.
◆ ఢిల్లీ విమానాశ్రయంలో మాన్యువల్ చెక్-ఇన్.
◆ ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా సేవలను అంతరాయం.
◆ US రాష్ట్రాల 911 సేవల నివేదికలు స్తంభించాయి.
◆ బెంగళూరు విమానాశ్రయం వ్యవస్థలు డౌన్.
#TravelUpdate: Due to infrastructure issues with our service provider, some of our online services, including booking, check-in and manage booking services will be temporarily unavailable. Currently we are following manual check-in and boarding processes at the airports and hence…
— Akasa Air (@AkasaAir) July 19, 2024
విమాన సేవల నుండి సూపర్ మార్కెట్, బ్యాంకింగ్ సేవల వరకు గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయం అన్ని రంగాలకు అంతరాయం కలిగిస్తోంది. ఈ అంతరాయం వల్ల భారతదేశంలో మూడు ఎయిర్ క్యారియర్లు.. ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ సంస్థలు బుకింగ్, చెక్-ఇన్,ఫ్లైట్ అప్‌డేట్‌లలో సమస్యలు ఎదురుకుంటున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశాయి.
"మేము ప్రస్తుతం విమాన అంతరాయాలపై నవీకరణలను అందించడంలో సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్నాము. ఈ సమస్యను పరిష్కరించడానికి మా బృందం చురుకుగా పని చేస్తోంది. ఏదైనా అసౌకర్యానికి చింతిస్తున్నాము, సమస్య పరిష్కరించబడిన తర్వాత మీకు తెలియజేస్తాము. మీ సహనానికి, సహ-సహకతకు ధన్యవాదాలు" అని స్పైస్‌జెట్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
I am aware of a large-scale technical outage affecting a number of companies and services across Australia this afternoon.
Our current information is this outage relates to a technical issue with a third-party software platform employed by affected companies.
— National Cyber Security Coordinator (@AUCyberSecCoord) July 19, 2024
— IndiGo (@IndiGo6E) July 19, 2024
#ImportantUpdate: We are currently experiencing technical challenges with our service provider, affecting online services including booking, check-in, and manage booking functionalities. As a result, we have activated manual check-in and boarding processes across airports. We…
— SpiceJet (@flyspicejet) July 19, 2024
🔴#JustIn | UK's biggest rail operator facing 'widespread' IT issues, warns of cancellations.
(Reported by news agency AFP) #Microsoft#Windows#Bluescreen
— NDTV (@ndtv) July 19, 2024