Weather: ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..ఏపీ, తెలంగాణ పై ప్రభావం ఉంటుందా?

మిచౌంగ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపింది. తాజాగా మరో తుఫాన్ దక్షిణం నుంచి బయలుదేరింది. 24గంటల్లో అల్పపీడనంగా ఏర్పడనుంది. నేటి నుంచి 5రోజుల పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్ లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది.

Weather: ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..ఏపీ, తెలంగాణ పై ప్రభావం ఉంటుందా?
New Update

భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆగ్నేయ అరేబియాలో తుఫాన్ వాతావరణం ఉంది. ఇది మాల్దీదీవుల పక్కనే ఉండటంతోపాటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ కారణంగా రానున్న 24గంటల్లో ఈప్రాంతంలో అల్పపీడనం ఏర్పడునున్నట్లు ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో నేటి 5 రోజుల పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్ లో వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయని పేర్కొంది. ముఖ్యంగా కేరళలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ తుఫాన్ వాతావరణం తెలుగు రాష్ట్రాల వైపు కదులుతోందని...తమిళనాడు, కేరళ, కర్నాటకకు దాటుకుని రావడానికి కొంత సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈలోపే మేఘాలు వర్షంగా కురిస్తే తెలుగు రాష్ట్రాల్లో వానలు ఉండవు. ఆ మేఘాలు మనవరకు వస్తే తెలుగు రాష్ట్రాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

కాగా నేడు తెలంగాణ, ఏపీకి ఎలాంటి వర్ష సూచన లేదు. కానీ మేఘాలు మాత్రం వచ్చిపోతుంటాయి. ఏపీలోని రాయలసీమలో ఎక్కువగా మేఘాల కదలిక కనిపిస్తుంది. బంగాళాఖాతంలో మళ్లీ గాలుల వేగం పెరగడంతో గంటకు 25కిలోమీటర్ల వేగంతో ఏపీవైపు వీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కొంత వరకు తగ్గాయి. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రత 18 డిగ్రీలునమోదు అయ్యింది. ఏపీలో 22డిగ్రీలుగా ఉంది. తెలంగాణలో పగలు ఉష్ణోగ్రత నేడు 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో అది 30డిగ్రీ లసెల్సియస్ ఉంటుంది. ఏపీలో తీర ప్రాంతాల్లో కొంత ఉక్కపోత ఉండేలా ఉంది. అయితే గాలల వల్ల ఆవిధంగా ఉండదు. ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి బాగా పెరుగుతోంది.

ఇది కూడా చదవండి: మోదీ సర్కార్ కీలక నిర్ణయం…సామాన్యులకు భారీ ఊరట…ధరలకు కళ్లెం పడే ఛాన్స్..!!

#weather #telugu-states-weather-report
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe