Cyclone Hamoon: బీ అలర్ట్.. తీరం దాటిన తుపాను.!
హమూన్ తుపాను తీరం దాటింది. దక్షిణ కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద RTVతో తెలిపారు. తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈశాన్య రుతుపవనాల విస్తరణకు అనువైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.