BRS Party In AP: ఏపీలో బీఆర్ఎస్ పోటీ?.. బీఫామ్ ఇవ్వాలంటూ కేసీఆర్ వద్దకు నేత

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏపీలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీ నేత కొణిజేటి ఆదినారాయణ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీఫామ్ ఇవ్వాలని కేసీఆర్‌ను కలిసి కోరనున్నట్లు చెప్పారు.

BRS Party In AP: ఏపీలో బీఆర్ఎస్ పోటీ?.. బీఫామ్ ఇవ్వాలంటూ కేసీఆర్ వద్దకు నేత
New Update

BRS Party In AP: ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉండగా తెలంగాణలో ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఏపీలో పోటీ చేసేందుకు సిద్దమైందా? అనే ప్రశ్న అటు తెలంగాణ, ఇటు ఏపీలోనూ నెలకొంది. తాజాగా ఏపీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఓ నేత సిద్ధమయ్యారు. తెలంగాణ ఫలితాలు ఒక లెక్క.. కానీ ఏపీలో మాత్రం బీఆర్ఎస్ హవా చూపిస్తా అని అంటున్నారు. ఏపీ బీఆర్ఎస్ నాయకుడు కొణిజేటి ఆదినారాయణ.. తాను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీఫామ్ ఇవ్వాలని కేసీఆర్ ను కలిసి కోరనున్నట్లు తెలిపారు. ఒకవేళ కేసీఆర్ బీఫామ్ ఇవ్వకపోతే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే విజయం సాధిస్తా అని ధీమా వ్యక్తం చేశారు.

Konijeti Adinarayana AP BRS Leader Konijeti Adinarayana

షేక్ చేద్దాం అనుకున్నారు.. చివరికి షాక్ తగిలింది..

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని అనుకున్న కేసీఆర్ ఆశలకు ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెక్ పెట్టాయి. తాజాగా ఏపీలో మాజీ సీఎం కేసీఆర్ కు భారీ షాక్ తగిలింది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు రావెల కిశోర్‌బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాగా టీఆర్ఎస్ నుంచి దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ మారిన తరువాత ఏపీలో ఆ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ ను నియమించారు కేసీఆర్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో మొదటగా పోటీ చేయాలని భావించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ్ కి నేతగా మారాలని అనుకున్న తన కళలకు గండి వేస్తాయని అని కేసీఆర్ అనుకోలేదు. అటు మహారాష్ట్రాలో సైతం బీఆర్ఎస్ కనుమరుగు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కకి పెడితే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ పార్టీ పేరు మారబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి దేశ రాజకీయాలు పక్కకు పెట్టి తెలంగాణ వరకే రాజకీయాలు కొనసాగిద్దామా? అని కేసీఆర్ ఆలోచనలో కేసీఆర్ పడ్డారనే టాక్ బీఆర్ఎస్ పార్టీలో జోరందుకుంది.

#kcr #konijeti-adinarayana #ap-brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe