/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/KCR-ASSEMBLY-1.jpg)
KCR:తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. మొన్న భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అధికార కాంగ్రెస్ చర్చను ప్రారంభించనుంది. బడ్జెట్‌పై ఇప్పటికే బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇక చీల్చి చెండాడతామని కేసీఆర్ కాంగ్రెస్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే సభకు కేసీఆర్ హాజరుపై సస్పెన్స్ నెలకొంది. బడ్జెట్ రోజు హాజరైన కేసీఆర్ చర్చకు వస్తారా? రారా? అనే చర్చ రాష్ట్ర ప్రజల్లో జోరుగా సాగుతోంది. కేసీఆర్‌కు సభకు రాకపోతే బడ్జెట్‌పై మాట్లాడేది ఎవరనే చర్చ జోరందుకుంది. మరోవైపు కేసీఆర్ సభకు రావాలని అధికార కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరి కేసీఆర్ వస్తారా లేదా వేచి చూడాలి.