జర్నలిస్టులందరికీ ఇల్లు కట్టిస్తామని బండి సంజయ్ హామీ జర్నలిస్టులకు స్థలం ఇస్తావా లేదా కేసీఆర్. జర్నలిస్ట్‌ల వల్లే నీకు సీఎం పదవి..నీ కుటుంబ సభ్యులు పదవులు వచ్చాయని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులందరికీ ఇల్లు కట్టిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. By Vijaya Nimma 16 Jun 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్‌లో జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల కోసం 17 సంత్సరల క్రితం ఒక్కొక్క జర్నలిస్ట్ రూ.2 లక్షల డబ్బులు కట్టారని.. మొత్తం 12.50 కోట్ల డబ్బులు కట్టారని తెలిపారు. జర్నలిస్టుల స్థలం జర్నలిస్టులకు ఇవ్వాలని తీర్పు కూడా వచ్చిందన్నారు. అయితే కేసీఆర్ కుటుంబ సభ్యుల కన్ను ఈ భూమి మీద పడిందని... అందుకే పేట్ బషీరాబాద్ స్థలం ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారన్నారు. ‘‘జర్నలిస్ట్‌ల వల్లే నువ్వు సీఎం అయ్యావు కేసీఆర్.. నీ కుటుంబ సభ్యులు పదవులు అనుభవిస్తున్నారని బండి అన్నారు. స్థలం కోసం చూసి చూసి 60మంది జర్నలిస్ట్‌లు చనిపోయారని అన్నారు. జర్నలిస్ట్ నాయకులు కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగుతున్నారని ఆరోపించారు. జర్నలిస్టుల సంక్షేమం గాలికి వదిలేశారన్నారు. జర్నలిస్టులకు స్థలం ఇస్తావా లేదా కేసీఆర్ అని ప్రశ్నించారు. జర్నలిస్ట్‌లకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. లీగల్ సహకారం చేస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఉండేది 5 నెలలే అని.. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మీ భూమి మీకు ఇస్తామని జర్నలిస్టులకు తెలిపారు. తెలంగాణలో ఉన్న జర్నలిస్టులందరికీ ఇల్లు కట్టిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి