Babu Mohan: టికెట్ కన్ఫామ్.. పోటీలో ఉన్నట్లా? లేనట్లా? బాబుమోహన్ నిర్ణయంపై ఉత్కంఠ!

బీజేపీ థర్డ్ లిస్ట్ రిలీజ్ అయ్యింది. ఈ లిస్ట్ లో ఆందోల్ నియోజకవర్గానికి బాబుమోహన్ పేరును ఖరారు చేశారు. అయితే, పార్టీ తీరుపై ఆగ్రహంతో ఉన్న బాబుమోహన్.. టికెట్ ఇచ్చినా పోటీ చేయనని ప్రకటించారు. దీంతో ఆయన పోటీ చేస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

New Update
Babu Mohan: టికెట్ కన్ఫామ్.. పోటీలో ఉన్నట్లా? లేనట్లా? బాబుమోహన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Babu Mohan: ఆందోల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు బాబు మోహన్‌కు టికెట్ కన్ఫామ్ చేసింది బీజేపీ(BJP). మూడవ లిస్ట్‌లో ఆయన పేరును ప్రకటించింది. అందోల్(Andole) నియోజకవర్గాన్ని ఆయనకు కేటాయించింది. అయితే, ఇప్పుడిదే మరింత ఉత్కంఠ రేపుతోంది. ఫస్ట్, సెకండ్ లిస్ట్‌లో తన పేరును ప్రకటించకుండా.. అవమానించారంటూ పార్టీ అధిష్టానంపై ఊగిపోయారు బాబుహన్. తరువాతి లిస్ట్‌లో టికెట్ ఇచ్చినా తాను పోటీ చేసేది లేదు పో అంటూ మీడియా ముఖంగా ప్రకటన చేశారు. ఇంత అవమానించిన తరువాత టికెట్ ఇస్తే పోటీ చేస్తానా? అంటూ తీవ్ర స్వరంతో ఊగిపోయారు. టికెట్ తన కొడుక్కి ఇస్తారంటూ ప్రచారం జరుగుతోందని, పార్టీ పెద్దలకు ఫోన్ చేసినా స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో కన్నీటిపర్యంతం అయ్యారు కూడా. ఈ క్రమంలోనే బీజేపీకి దూరంగా ఉంటానని, ఎన్నికల్లో పోటీ చేయనని కరాఖండిగా ప్రకటించేశారు.

ఇదికూడా చదవండి: సీపీఎం సంచలన నిర్ణయం.. 17 స్థానాల్లో పోటీ..

కట్ చేస్తే బీజేపీ టికెట్ కన్ఫామ్..

ఇంత ఇష్యూ జరిగిన తరువాత బీజేపీ అధిష్టానం ఆందోల్ నియోజకవర్గానికి బాబుమోహన్ పేరును ఖరారు చేసింది. గురువారం పార్టీ విడుదల చేసిన మూడవ లిస్ట్‌లో ఆయన పేరు కూడా ఉంది. అయితే, బాబుమోహన్ పోటీ చేస్తారా? లేదా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మీడియా సమావేశంలో బీజేపీ అధిష్టానంపై, పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. మళ్లీ బ్యాక్ స్టెప్ తీసుకుంటారా? అనే చర్చ నడుస్తోంది. మరి ఇంతకుముందు ప్రకటించినట్లుగా పోటీ నుంచి తప్పుకుంటారా? లేక రాజకీయాల్లో ఈ మాటలు కామన్ అంటూ మళ్లీ ఎన్నికల బరిలో నిలుస్తారా? అనేది తెలియాలంటే.. ఆయన ప్రకటన కోసం ఎదురు చూడాల్సిందే.

ఇదికూడా చదవండి: బండి వర్సెస్ ఈటల.. ఆ మూడు సీట్ల కోసం ఫైట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు