Wife and Husband: భార్యాభర్తల మధ్య గొడవలకు ప్రధాన కారణాలివే..!

భార్యాభర్తల గొడవలు సర్వసాధారణం. గొడవలు లేనిది అసలు సంసారమే కాదని అంటారు. కానీ, ఇప్పుడైతే చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. సాధారణంగా దంపతుల మధ్య గొడవలకు దారితీసే అంశాలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

New Update
Wife and Husband: భార్యాభర్తల మధ్య గొడవలకు ప్రధాన కారణాలివే..!

Wife and Husband Relation: సంబంధాలు (Relations) చాలా సున్నితమైనవి. ఎదుటి వారితో ఎలా వ్యవహరిస్తున్నామనేదే.. సంబంధం కొనసాగడం, విడిపోవడం అనే అంశాలు ఆధారపడి ఉంటాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా సంబంధాన్ని తెగతెంపులు చేస్తుంది. భార్యాభర్త (Wife & Husband)ల అనుబంధం దీనికి మినహాయింపు కాదు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కూడా కొన్నిసార్లు బంధం విచ్ఛిన్నానికి దారితీస్తాయి. ముఖ్యంగా జంటల మధ్య తగాదాలకు 5 సాధారణ కారణాలు ఉన్నాయని, వాటి పట్ల అవగాహన కలిగి ఉంటే మీ బంధం దృఢంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. డబ్బు సంబంధిత కారణాలు, ఇంటిపనులు చేయకపోవడం, గోప్యత, సాన్నిహిత్యం లేకపోవడం, పిల్లల పట్ల బాధ్యత, వ్యక్తిగత ప్రాధాన్యతలు, సెలవులు వంటివి వివాహ బంధం విచ్ఛిన్నానికి దారితీసే కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయి.

డబ్బు..

డబ్బు (Money) కోసం దంపతుల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకరు విలాసాలకు ఆసక్తి చూపుతారు. మరికొందరు డబ్బు ఆదా చేయడానికి ఇష్టపడతారు. ఏ వస్తువు కొనుగోలు చేయాలి.. డబ్బును ఏం చేయాలనే విషయంలో గొడవలు జరుగుతుంటాయి. దీన్ని నివారించాలంటే దంపతులిద్దరూ కాస్త రాజీపడాలి. మీ ఇంటి బడ్జెట్‌ను కలిసి సెట్ చేసుకోవాలి. కిరాణా, విద్యుత్ బిల్లులు మొదలైన అన్ని ప్రాథమిక అంశాలను లెక్కించాలి. ఆ తరువాత మీ విలాసాలు, అవసరాల కోసం ఖర్చు చేయడానికి కొంత డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాలను దంపతులిద్దరికీ నచ్చే విధంగా ఉంచాలి.

ఇంటి పని..

ఇంటిపనిలో ఎక్కువ భాగం భార్యపైనే పడుతోంది. అలాంటప్పుడు ఇంటిపనితో సంబంధం లేదన్నట్లుగా భర్త కూర్చుంటే గొడవలు జరగడం మామూలే. అందుకే.. మీ భార్య అడగకపోయినా ఇంటి పనిలో సహాయం చేయండి. అప్పుడు ఇద్దరి మధ్య అనుబంధం, ప్రేమ, సామరస్యం పెరుగుతాయి. ఇద్దరూ మాట్లాడుకుని పని పంచుకుంటే భారంగా అనిపించదు.

మితిమీరిన స్వాధీనత..

పొసెసివ్‌నెస్ అనేది సంబంధాన్ని త్వరగా పాడుచేసే అంశం. మీ జీవిత భాగస్వామిపై మీకు ఎంత ప్రేమ ఉందో, వారికి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఒకటి రెండు సార్లు ప్రదర్శించొచ్చు. కానీ, ప్రేమ పేరుతో పొసెసివ్‌నెస్ ప్రదర్శిస్తూ వారిని నిరంతరం చికాకుపెడుతూ ఉంటే మీ బంధం విచ్ఛిన్నానికి దారి తీస్తుంది. అందుకే.. మీరు మీ భాగస్వామికి ఎంత విలువ ఇస్తున్నారో అర్థమయ్యేలా చేస్తూనే హద్దుల్లో ఉండాలి.

లైంగిక సాన్నిహిత్యం..

భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాలు కూడా కొన్నిసార్లు గొడవలకు దారితీస్తాయి. కొందరికి శారీరక కలయికపై ఆసక్తి తక్కువగా ఉండవచ్చు, మరికొందరికి ఎక్కువ ఆసక్తి ఉండవచ్చు. అలాంటి పరిస్థితిలో.. కోపం, విసుగు, ఆగ్రహం సర్వసాధారణం. అందుకే.. కొన్నిసార్లు మీరు మీ భాగస్వామి ఇష్టాఇష్టాలకు అనుగుణంగా నడుచుకోవాలి.

పిల్లలు..

పిల్లల బాధ్యతను తానే భరించాలని ఇంట్లో భార్య, భర్తల మధ్య నిరంతరం తగువు జరుగుతుంటుంది. భార్య రోజంతా ఇంటిపనులు చేయడం వల్ల అలసిపోవడం లేదా ఒత్తిడికి గురి కావడం వల్లే ఈ రకమైన వాదనలు జరుగుతుంటాయి. వీటిని భర్తలు అర్థం చేసుకోవాలి. కాసేపు తమ చిరాకును బయట పెట్టనివ్వాలి. కాసేపు వారిని శాంతించనివ్వండి. వాస్తవానికి పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులిద్దరూ సమాన బాధ్యతలను నిర్వర్తిస్తేనే.. ఆ దంపతులు హ్యాపీగా ఉంటారు.

Also Read:

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను క‌లిసిన స్వగ్రామస్తులు.. భావోద్వేగం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు