Valentine's day:ప్రేమకు చిహ్నం వాలంటైన్స్ డే..

ప్రేమ గురించి చెప్పడానికి ఒక్క మాట సరిపోదు...ప్రేమను వ్యక్త పరచడానికి ఒక్క రోజు చాలదు. కానీ వేలంటైన్స్‌డే రోజు మాత్రం దీనికి అతీతం. ఈ రోజు ప్రేమకు ఓ ప్రత్యేకత ,ఒక ఆకర్షణా ఉంటుంది. అందుకే ఈ రోజుకు అంత స్పెషాలిటీ. అసలు ఇది ఎక్కడ, ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసా..

New Update
Valentine's day:ప్రేమకు చిహ్నం వాలంటైన్స్ డే..

Who Is This Valentine:మదర్స్ డే, ఫాదర్స్ డే, వుమెన్స్ డే… ఇలా స్పెషల్ రోజుల గురించి మాట్లాడేటప్పుడు అన్నిటికంటే ముందు గుర్తొచ్చే డే, వేలంటైన్స్ డే. అందరికీ ప్రత్యేకంగా ఓ రోజు ఉన్నట్టు ప్రేమికుల కోసమే ఈ వేలంటైన్స్ డే. అసలు ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక రోజు అంటూ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరమే లేదు. ప్రేమను ఎప్పుడైనా ఎలాగైనా వ్యక్తం చేయొచ్చు. అయితే వాలెంటైన్స్ డే జరుపుకోవడం వెనుక ఓ చరిత్ర ఉంది. అసలు వాలెంటైన్స్ డే అంటే ఏంటీ? ఆ రోజును ప్రేమికుల రోజుగా ఎందుకు గుర్తిస్తారు? ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకొంటారు? ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది ఇప్పటి చరిత్ర కాదు..

వేలంటైన్స్ డే ఎందుకు జరుపుకొంటారు అన్న ప్రశ్నకు రకరకాల సమాధానాలున్నాయి. వేర్వేరు చరిత్రలున్నాయి. అందులో బాగా ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం వేలంటైన్ గురించి. ఈ వేలంటైన్స్ డే ఇప్పటిది కాదు. క్రీస్తు శకం 270 నాటిది. హింస, స్వార్థం, ద్వేషం లాంటి దుర్గుణాలపై పోరాడటానికి ప్రేమను మించిన ఆయుధం లేదని నమ్మేవాడు క్రైస్తవ మతగురువు వేలంటైన్. క్రీస్తు శకం 270 కాలంలో రోమ్‌లో ఉండేవాడు. తాను నమ్మిన ప్రేమ సిద్ధాంతాన్ని యువకులకు బోధించేవాడు. యువతీయువకుల మధ్య ప్రేమ చిగురించేలా చేసేవాడు. అంతేకాదు… ప్రేమలో మునిగితేలుతున్న యువతీయువకులకు దగ్గరుండి మరీ పెళ్లి కూడా చేసేవాడు. ఆ సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి పేరు క్లాడియస్. క్రూరాతిక్రూరమైన రాజు. ప్రేమ పెళ్లిళ్లు కాదు కదా అసలు పెళ్లిళ్లంటేనే ఆ చక్రవర్తికి ఇష్టం లేదు. అందుకే పెళ్లిళ్లపై నిషేధం విధించాడు.

చనిపోయేంత వరకు ప్రియురాలి ప్రేమలోనే వేలంటైన్...

ఓవైపు పెళ్లిళ్లు అంటే ఇష్టం లేని రాజు క్లాడియస్… మరోవైపు ప్రేమ పెళ్లిళ్లను ప్రోత్సహిస్తున్న వేలంటైన్. క్రమంగా అక్కడ ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి. ఏం జరుగుతుందా అని క్లాడియస్ ఆరా తీశాడు. వేలంటైన్ ప్రేమ పాఠాల గురించి తెలిసింది. అంతే… ఈ ప్రేమలకు, పెళ్లిళ్లకు వేలంటైన్ కారణమని తెలుసుకున్న క్లాడియస్ అతడిని బంధించాడు. రాజద్రోహం చేశాడన్న ఆరోపణలతో మరణశిక్ష విధించాడు. అయితే ఎంతోమంది ప్రేమ పెళ్లిళ్లకు కారణమైన వేలంటైన్… జైలులో ఉండగా జైలు అధికారి కూతురితో ప్రేమలో పడ్డాడు. చివరికి వేలంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరితీశారు. చనిపోయేవరకు ప్రియురాలి గురించే తలచుకుంటూ ఉన్నాడు వాలెంటైన్. యువర్ వేలంటైన్... అంటూ అని ఆమెకు చివరి ప్రేమలేఖ కూడా రాసి చనిపోయాడు. అలా... యువర్ వేలంటైన్, అనే మాట ప్రేమికుడికి పర్యాయ పదంగా మారిపోయింది. వేలంటైన్ చనిపోయిన రోజునే ప్రేమికుల దినోత్సవం..

ఫిబ్రవరి 14న వేలంటైన్‌ను ఉరి తీశారు కాబట్టి అదే రోజున ప్రేమికుల రోజు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే భారతదేశంలో మాత్రం ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం 1990వ దశకంలో మొదలైంది. ఆర్థిక సరళీకరణ తర్వాత వేలంటైన్స్‌ డే ఇండియాలో పాపులర్ అయింది. దీనిపై ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. ప్రేమికుల రోజు భారతదేశ సంస్కృతి కాదంటూ వ్యతిరేకించేవాళ్లున్నారు. వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు… పలు హిందుత్వ సంస్థలు ధర్నాలు, ఆందోళనలు, గొడవలు చేయడం చూస్తూనే ఉంటాం. ఇక ప్రేమికుల రోజు కార్పొరేట్ కంపెనీలు సృష్టించిన మాయ అన్న వాదన మరొకటి ఉంది. ఎందుకంటే వేలంటైన్స్‌ డే సందర్భంగా వందల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా ప్రపంచమంతా ప్రేమికుల మనసుల్లో వేలంటైన్స్‌డే ప్రత్యేక స్థానం అయితే సంపాదించుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు