Sleeper Bus: స్లీపర్ బస్సులో ప్రమాదం జరిగితే తప్పించుకోవడం ఎందుకు కష్టంగా మారుతుంది?

స్లీపర్ బస్సులో ప్రయాణీకులు పడుకోవడానికి ఉన్న సౌకర్యం అటూ ఇటూ తిరిగే గ్యాలరీలో ఉండదు. అందుకే ప్రమాదం జరిగినపుడు తప్పించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. 

New Update
Sleeper Bus: స్లీపర్ బస్సులో ప్రమాదం జరిగితే తప్పించుకోవడం ఎందుకు కష్టంగా మారుతుంది?

నవంబర్ 8వ తేదీ రాత్రి 8.30 గంటలకు. జైపూర్ నుంచి ఢిల్లీకి వస్తున్న స్లీపర్ బస్సు(Sleeper Bus) గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఝర్సా ఫ్లైఓవర్ మీదుగా వెళుతోంది. అందులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటం ప్రారంభించాయి. డ్రైవర్ దూకి పారిపోయాడు. కొద్ది నిమిషాల్లోనే ఇద్దరు ప్రయాణికులు సజీవదహనమై 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ఏడాది జూలైలో మహారాష్ట్రలోని బుల్దానా సమృద్ధి హైవేపై స్లీపర్ బస్సు(Sleeper Bus) మంటల్లో చిక్కుకుని 25 మంది ప్రయాణికులు చనిపోయారు. ప్రయాణికులు తప్పించుకోవడానికి సమయం దొరకలేదు. స్లీపర్ బస్సులను కదిలే శవపేటికలుగా పేర్కొంటూ నిషేధించాలని నిపుణులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అసలు స్లీపర్ బస్సులు(Sleeper Bus) ఎందుకు ప్రాణాంతకం అని నిపుణులు చెబుతున్నారు? స్లీపర్ బస్సుల్లో ప్రమాదం జరిగితే ప్రయాణీకులు ఎక్కువగా ఎందుకు చనిపోతారు? అర్ధం చేసుకుందాం. 

స్లీపర్ బస్సులు ఎక్కువ ప్రమాదాలు జరగడానికి - అవి ప్రాణాంతకంగా మారడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి - బస్సు డిజైన్ అలాగే దాని రెస్పాండ్ మెకానిజం.

డిజైన్: ప్రమాదం జరిగినప్పుడు బతికే అవకాశం చాలా తక్కువ.

సాధారణంగా 2x1 ఇండియన్ స్లీపర్ కోచ్‌లో 30 నుంచి  36 సీట్లు ఉంటాయి. మల్టీ-యాక్సిల్ కోచ్‌లలో సీట్ల సంఖ్య 36-40 మధ్య ఉంటుంది. అన్ని బెర్త్‌ల పొడవు సుమారు 6 అడుగులు - వెడల్పు 2.6 అడుగులు ఉంటుంది. ఇది ఓకే కానీ,  గ్యాలరీలో స్థలం లేకపోవడంతో సమస్య తలెత్తుతోంది.

స్లీపర్ బస్సులు(Sleeper Bus) ప్రయాణానికి చాలా ఇరుకైన గ్యాలరీలను కలిగి ఉంటాయి. ఒకే సమయంలో ఒక వ్యక్తి కూడా సరిగ్గా నడిచే స్ధలం ఉండదు. ప్రమాదం జరిగితే, అక్కడ నుంచి ఒకేసారి తప్పించుకోవడం చాలా మందికి అసాధ్యం. ఇది క్యాజువాలిటీస్ ను పెంచుతుంది.

సరిగ్గా నిపుణులు కూడా ఈ అంశంపైనే ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. స్లీపర్ బస్సులు(Sleeper Bus) ప్రయాణీకులను పడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. కానీ అందులో బయటకు రావడానికి.. లోపలకు వెళ్ళడానికి చాలా తక్కువ స్థలం ఉంటుంది. దీంతో ప్రయాణీకులు మూమెంట్ విషయంలో తీవ్ర ఇబ్బందులు  పడతారు. అందుకే ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలు బయటకు రాలేక బస్సులోనే  ఇరుక్కుపోతున్నారు.

Also Read: Traffic Violations: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాదారుడికి రూ.86 వేలు ఫైన్..

స్లీపర్ బస్సుల(Sleeper Bus) ఎత్తు కూడా సమస్యగా ఉంది. సాధారణంగా 8-9 అడుగుల ఎత్తు ఉంటుంది.  బస్సు అకస్మాత్తుగా ఒక వైపుకు వంగితే కనుక, ప్రయాణికులు ఎమర్జెన్సీ విండో లేదా గేట్‌కు చేరుకోవడం కష్టంగా మారుతుంది. .

బయట సహాయ కార్యక్రమాలలో నిమగ్నమైన వ్యక్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు.  ఎందుకంటే వారు ప్రయాణీకులను బయటకు తీయడానికి ముందు 8-9 అడుగులు ఎక్కాలి. దీనివల్ల ప్రాణనష్టం కూడా పెరుగుతుంది.

రెస్పాన్స్ మెకానిజం: డ్రైవర్ అతిగా పని చేయడం, ప్రయాణీకులకు కూడా తక్కువ ప్రతిస్పందన సమయం

చాలా స్లీపర్ బస్సులు(Sleeper Bus) రాత్రిపూట 300 నుంచి 1000 కి.మీ దూరం ప్రయాణిస్తాయి. ప్రయాణీకులకు నిద్రపోయే సౌకర్యం ఉంటుంది కానీ, చాలా దూరం రూట్లలో, అటువంటి బస్సులలో, డ్రైవర్ అలసిపోయి, దూర మార్గాల్లో ఒక్కోసారి రెప్ప వేసే  అవకాశం ఉంది. బుల్దానా స్లీపర్ బస్సు ప్రమాదం విషయంలో పోలీసులు డ్రైవర్ కు తల తిరగడం లేదా నిద్రలోకి జారిపోవడంతోనే  బస్సుపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని చెప్పారు. ప్రమాద సమయంలో హెచ్చరిక  వ్యవస్థ ఉపయోగంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డ్రైవరు నిద్రపోతున్నట్లు అనిపించినప్పుడు డ్రోసైనెస్ అలర్ట్ సిస్టమ్ హెచ్చరిస్తుంది. బస్సులో డ్రస్‌నెస్‌ అలర్ట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి ఉంటే, బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేసి నిద్రపోయే సమయంలో నిద్రలేపి ఉండేవారని, ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని పోలీసులు ఆ ఆక్సిడెంట్ సందర్భంగా చెప్పారు. 

Sleeper Bus వివిధ భాగాలలో అమర్చిన సెన్సార్లను-డ్యాష్‌బోర్డ్‌లోని కెమెరాలను నిద్రిస్తున్న డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి ఉపయోగిస్తుంది. స్టీరింగ్ నమూనాలు, లేన్‌లో వాహనం స్థానం -  డ్రైవర్ కన్ను అలాగే ముఖం - కాలు కదలికలను పర్యవేక్షించడం ద్వారా డ్రైవర్ మగతను గుర్తించవచ్చు.

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ 2018లో 15 రాష్ట్రాల్లో డ్రైవర్లపై సర్వే నిర్వహించింది. సర్వేలో పాల్గొన్న 25% మంది డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రలోకి జారుకున్నట్లు అంగీకరించారు. హైవేలు - గ్రామీణ రహదారులపై ప్రయాణించేటప్పుడు డ్రైవర్లు ఎక్కువగా నిద్రపోతారని ప్రపంచ అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అలాగే ఈ పరిస్థితి అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య జరిగే అవకాశం ఉంది.

Sleeper Bus: ప్రమాదం జరిగితే, మేల్కొని ఉన్న ప్రయాణీకుల ప్రతిస్పందనలో.. నిద్రిస్తున్న ప్రయాణీకుల ప్రతిస్పందనలో తేడా ఉంటుంది. చాలా సార్లు మొదటి 2 నిమిషాల ప్రతిచర్య జీవితం - మరణాన్ని నిర్ణయిస్తుంది. కూర్చున్న ప్రయాణీకుడు, నిద్రమత్తులో ఉన్నప్పటికీ, పడుకున్న ప్రయాణికుడి కంటే మెరుగ్గా స్పందిస్తాడు. ఎవరైనా పై బెర్త్‌పై నిద్రిస్తున్నట్లయితే, అతను తప్పించుకునే అవకాశాలు మరింత తగ్గుతాయి.

Watch this Interesting video:

Advertisment
తాజా కథనాలు