Cool Drinks : కూల్ డ్రింక్స్ వల్ల నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా... సమ్మర్ వచ్చిందంటే చాలు, కూల్‌డ్రింక్స్ సేల్స్ అమాంతం పెరిగిపోతాయి. దాహంగా ఉన్నప్పుడు నీళ్లకు బదులు కూల్‌డ్రింక్స్ తాగడాన్నే ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు.అయితే కూల్ డ్రింక్స్ లో నిజంగా హానికర పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోండి.. By Durga Rao 08 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Side Effects : కూల్‌డ్రింక్ బాటిళ్లు(Cool Drink Bottles) తెచ్చుకుని ఫ్రిజ్‌లో దాచుకునే వాళ్లూ ఉన్నారు. అయితే వీటికి అతిగా అలవాటు పడడం వల్ల బోలెడు నష్టాలున్నాంటున్నారు(Disadvantages) డాక్టర్లు. అసలు కూల్‌డ్రింక్స్ ఎందుకు తాగకూడదంటే.. కార్బన్ డయాక్సైడ్(Carbon Dioxide) తో నింపిన చల్లని కూల్‌డ్రింక్స్ తాగిన వెంటనే గొంతుకి హాయిగా ఉంటుంది. వెంటనే రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ, ఈ అలవాటు వల్ల రానురాను అనేకరకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరం నుంచి కార్బన్‌ను తీసివేయడమే కొన్ని అవయవాల ముఖ్యమైన పని అని మీకు తెలుసా? లివర్, ఊపిరితిత్తుల వంటి ఆర్గాన్స్ ప్రతిక్షణం శరీరం నుంచి కార్బన్‌ను ఫిల్టర్ చేస్తూ శరీరాన్ని నిరంతరం ఆరోగ్యంగా ఉంచేందుకు కష్టపడుతుంటాయి. కానీ, కూల్‌డ్రింక్స్ మోజుతో చాలామంది అదే కార్బన్‌ను శరీరంలోకి పంపిస్తుంటారు. దీనివల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతుంది. కూల్‌డ్రింక్స్‌లో ఎక్కువశాతం కేలరీలు ఉంటాయి. వీటిని తాగడం అలవాటు చేసుకుంటే కొద్దిరోజుల్లోనే బరువు పెరుగుతారు. ఇందులో ఉండే హై షుగర్ కంటెంట్ వల్ల లివర్ పాడవుతుంది. క్రమంగా ఫ్యాట్ స్టోర్ అవ్వడం మొదలవుతుంది. అంతేకాదు కార్బొనేటెడ్ డ్రింక్స్ వల్ల డయాబెటిస్, బీపీ వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. దీని కూల్‌డ్రింక్స్‌లో ఉండే పాస్ఫరిక్ యాసిడ్ వల్ల అరుగుదల మందగిస్తుంది. రోజూ కూల్‌డ్రింక్స్ తాగేవాళ్లకు అజీర్తి, మలబద్ధకం వంటివి మొదలయ్యే అవకాశం ఉంది. కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల బాడీ మెటబాలిజం తగ్గి ఇమ్యూనిటీ దెబ్బ తింటుంది. శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి తగ్గుతుంది. తద్వారా తరచూ జలుబు, దగ్గు వంటివి వేధిస్తుంటాయి. కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల లివర్‌పై అధిక భారం పడుతుంది. అంతేకాదు కూల్‌డ్రింక్స్‌లో ఉండే హై క్యాలరీల కారణంగా లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. క్రమంగా ఇది ఫ్యాటీ లివర్ సమస్యకు దారి తీస్తుంది. కూల్‌డ్రింక్స్‌లో షుగర్స్, కార్బన్ డయాక్సైడ్‌తో పాటు కెఫీన్ కూడా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు(Heart Stroke) పెరిగే ప్రమాదముంది. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. దాహం తీరడం కోసం కూల్‌డ్రింక్స్ తాగుతుంటారు చాలామంది. అయితే కూల్‌డ్రింక్స్ వల్ల శరీరం మరింత డీహైడ్రేట్ అవుతుంది. కార్బొనేటెడ్ డ్రింక్స్ వల్ల కిడ్నీలపై కూడా అదనపు భారం పడుతుంది. ఇక వీటితోపాటు కూల్‌డ్రింక్స్ వల్ల చిగుళ్ల సమస్యలు, దంతాలు పాడవ్వడం, ఎముకలు బలహీనపడడం, స్కిన్ సమస్యలు, మెదడు పనితీరు తగ్గడం వంటి రకరకాల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. Also Read : వినాయకుడి విగ్రహాన్ని ప్రధాన ద్వారం వద్ద ఉంచడం శుభమా? అశుభమా?.. వాస్తు ఏం చెబుతోంది #health #disadvantages #cool-drinks-side-effects #soft-drinks మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి