nightmares: ఇలాంటి చెడ్డ కలలు ఎందుకు వస్తాయని ఆరా తీస్తే ముందురోజు జరిగిన కొన్ని దుర్ఘటనలని, చూసిన హర్రర్ సినిమాని సాకుగా చూపి తప్పుకుంటాం. పీడ కలలు పెద్దల్లో కంటే పిల్లలనే ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అలాగని పెద్ద వయసు రాగానే వీటి నుంచి విముక్తి దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. 50 శాతం మంది పెద్దల్లో కూడా ఈ చెడ్డ కలలు వస్తాయని, మగాళ్ల కంటే ఆడవాళ్లలోనే వీటి బెడద ఎక్కువని సైకాలజీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: స్మార్ట్ ఫోన్ వినియోగం రోజుకు 5 గంటలు మించితే ఏమవుతుంది..?
పీడకలలు క్వాలిటీ స్లీప్‌ని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని కొందరిలో అపోహలు ఉన్నాయి. అది కూడా అబద్ధమట. కానీ తరచూ ఇలాంటి కలలు రావడం రెగ్యులర్ లైఫ్ ప్రభావితం కావడం, నిద్రపోవాలంటేనే భయపడడం లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాల్సిందే. రెగ్యులర్‌గా పీడ కలలు వచ్చేవాళ్లు కొన్నాళ్లకు ఆత్మహత్యలాంటి విపరీత ఆలోచనలకు కూడా తెగిస్తారని, చెడ్డకలలకు మానసిక ఆరోగ్య సమస్యలకు మధ్య సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాలిక్స్ మాత్రం అందినంతా పుచ్చుకుని సద్దుచేయకుండా నిద్రలోకి జారుకుంటారు.
పీడకలలు తప్పవని నిపుణుల హెచ్చరిక
కానీ.. తాగుబోతులకు పీడకలలు వచ్చే ఛాన్సులు ఎక్కువట, మద్యంతో నిండిన కడుపులో జరిగే మెటబాలిజం శరీరాన్ని, మెదడును కూడా చెడుదారి పట్టిస్తుందని ఓ పరిశోధనలో తేలింది. పడుకోవడానికి లిక్కర్ లేదా వైన్ పనిచేయొచ్చు కానీ దానివల్ల, నిద్ర ద్వారా మీ శరీరానికి సహజంగా అందాల్సిన విశ్రాంతి మాత్రం దొరకదని వైద్యులు చెబుతున్నారు. మనం నిద్రపోయేటప్పుడు రెమ్ అనే దశ ఉంటుంది. ఈ దశలోనే ఎక్కువగా కలలు వస్తాయి. మోతాదు మించిన మద్యం ఈ దశని చెడగొడుతుందట. ఫలితంగా పీడకలలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక గ్రాండ్ రిలీఫ్ కూడా ఉంది. వోడ్కా టానిక్ తీసుకుని పడుకుంటే పీడకలలు అసలే రావని, సుఖనిద్ర ప్రాప్తిస్తుందని చెబుతున్నారు.