బెంగళూరులో వర్షం కురిసి 140 రోజులు!

కొన్ని దశాబ్దాల్లోనే ఎన్నడూ చూడని కరవును ప్రస్తుతం బెంగళూరు నగరం చవిచూస్తోంది. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క.. బెంగళూరు నగరవాసులు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. అసలు బెంగళూరు నగర నీటి సమస్యకు పరిష్కారం ఎప్పుడు అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

New Update
బెంగళూరులో వర్షం కురిసి 140 రోజులు!

సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, దేశానికి ఐటీ హబ్‌గా ఉన్న బెంగళూరు నగరం ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. బెంగళూరు వాసులు నీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బెంగళూరు నగరంలో గత 140 రోజులుగా వర్షాలు పడటం లేదు. దీంతో నీటి సమస్య ఈ వేసవి కాలంలో మరింత ఉద్ధృతం అయింది. ఇక ప్రస్తుతం బెంగళూరు పరిసర ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుండటంతో నగరవాసులకు కొంత ఊరట కలుగుతోంది. అయితే బెంగళూరులో మాత్రం ఎండలు మండిపోవడం వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి, వర్షపాతం లేనప్పటికీ.. సమీపంలో ఉన్న కూర్గ్ జిల్లాలోని మడికేరి, విరాజ్‌పేట వంటి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయపుర జిల్లాకు ఉత్తరాన ఉరుములు, తుఫానులతో కూడిన వర్షాలు పడుతుండటం బెంగళూరు వాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

బెంగళూరుతో సహా దక్షిణ కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో మార్చి నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని గతంలో భారత వాతావరణ శాఖ అంచనా వసింది. అయినప్పటికీ.. బెంగళూరులో ఒక్క చుక్క కూడా వర్షం పడలేదు. వర్షం సంగతి అటుంచితే.. ఈ ఏడాది మార్చిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. మార్చి 29 వ తేదీన గరిష్టంగా 36.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఏప్రిల్ నెలలో 5 వ తేదీన 38.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అయితే బెంగళూరులో గత కొన్ని నెలలుగా ఎందుకు వర్షం పడట్లేదు అనే విషయాన్ని భారత వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎల్‌నినో కారణంగా నిరంతరం వేడి వాతావరణం, పొడి స్పెల్ కారణమని పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో మధ్య ప్రాంతంలో వేడి జలాలు ఉండటం కూడా ఒక కారణమని తెలిపారు. ఇవే ప్రస్తుతం బెంగళూరులో ఉష్ణోగ్రతలు పెరగడానికి, వర్షపాతం తక్కువ నమోదు కావడానికి కారణమని తెలిపారు. అయితే సాధారణంగా ఏప్రిల్ నెలలో ఉరుములతో కూడిన తుఫాన్లు ఈ సంవత్సరం ఏప్రిల్‌లో కనిపించవని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

గత ఏడాది వర్షాకాలం తర్వాత బెంగళూరులో చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదు కాలేదు. ఈ ఏడాదిలో గత 3 నెలలుగా వర్షం కురవడం లేదు. సాధారణంగా జనవరి, ఫిబ్రవరి నెలలు పొడి నెలలు కాగా.. మార్చి నెలలో కొన్ని వర్షాలు కురుస్తాయి. దీంతో కొంత ఉపశమనం కలిగేది. కానీ ఈ సారి ఈ ఏడాది బెంగళూరు నగరంలో చెప్పుకోదగ్గ వర్షాలు లేవని.. ట్విట్టర్‌లో కర్ణాటక వాతావరణ నిపుణులు తెలిపారు. బెంగళూరు నగరంలో వర్షం పడి 140 రోజులు అయ్యిందని పేర్కొన్నారు. ఇక ఎల్‌నినో కారణంగా తీవ్రమైన శీతాకాల పరిస్థితులు లేకపోవడం కూడా ప్రస్తుతం వర్షాలు పడకపోవడానికి కారణం అని ఐఎండీ బెంగళూరు శాస్త్రవేత్త ఎ. ప్రసాద్ తెలిపారు. వీటికితోడు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో తుఫాను వ్యతిరేక సర్క్యులేషన్ కారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. ఇవే వర్షాలు పడకుండా ఆపుతున్నాయని పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు