Feet Swelling: పాదాల్లో వాపు ఎందుకు వస్తుంది..సకాలంలో గుర్తించకపోతే అంతేనా? చలికాలంలో పాదాలు వాస్తూ ఉంటాయి. అతిగా నడవడం, బెణుకు, గాయం లేదా ఎక్కువ సేపు నిలబడడం వల్ల కూడా అప్పుడప్పుడు పాదాల వాపు రావచ్చు. పోషకాలు లేకపోవడం, కిడ్నీల వైఫల్యం, లివర్ పాడైపోవడం వల్ల కూడా పాదాలలో వాపు వస్తుంది. సోడియం పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. By Vijaya Nimma 09 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Feet Swelling: కొన్నిసార్లు మన పాదాలు వాస్తూ ఉంటాయి. చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. చిన్న ప్రాబ్లమే కదా అని లైట్ తీసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా నడవడం, బెణుకు, గాయం లేదా ఎక్కువ సేపు నిలబడడం వల్ల కూడా అప్పుడప్పుడు పాదాల వాపు రావచ్చు. పాదాల వాపునకు హైపోథైరాయిడిజం ప్రధాన కారణం. అంటే థైరాయిడ్ హార్మోన్లు, ప్రొటీన్లు అధిక మొత్తంలో రక్తనాళాలలో ఏర్పడతాయి. దీని కారణంగా శరీరంలో ద్రవాలు పేరుకుపోతాయి. అంతేకాకుండా హైపోథైరాయిడిజం మన జీవక్రియపైనా ప్రభావం చూపుతుంది. అలాగే కిడ్నీల రక్త ప్రసరణ కూడా దెబ్బతింటుంది. దీంతో పాదాలలో వాపు కనిపిస్తూ ఉంటుంది. పోషకాలు లేకపోవడం: పోషకాల లోపం వల్ల కూడా పాదాలలో వాపు వస్తుంది. అంతే కాకుండా సోడియం పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో నీరు పేరుకుపోతుంది. దీని కారణంగా పాదాలు ఉబ్బుతాయి. కిడ్నీల వైఫల్యం: మూత్రపిండాలు విఫలమైనప్పుడు, రక్తం నుంచి మూత్రం ఫిల్టర్ కాదు. దీని కారణంగా రక్తంలో ప్రోటీన్ అల్బుమిన్ స్థాయి తగ్గుతుంది.మూత్రం స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో పాదాలలో వాపు కనిపిస్తూ ఉంటుంది. అలాగే వెన్నునొప్పి కూడా వస్తుంది. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు అంటున్నారు. లివర్ పాడైపోయినా: కాలేయం పాడైపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ కూడా మందగిస్తుంది. దీని కారణంగా కాలేయానికి రక్తాన్ని తీసుకువెళ్లే సిరలపై చాలా ఒత్తిడి ఉంటుంది. సిరలపై పెరిగిన ఒత్తిడి కారణంగా నీరు చేరడంతో మన పాదాలు ఉబ్బుతాయి. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: అతిగా నైట్ షిఫ్ట్‌లు చేస్తున్నారా..? ఈ సమస్యలు తప్పవు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #feet-swelling మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి