Skin Rashes: ఒత్తిడి ఎక్కువైతే శరీరంలో జరిగే మార్పులు ఇవే..దీర్ఘకాలిక సమస్యలు తప్పవా..?

సాధారణంగా రకరకాల కారణాల వల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. గాలిలో తేమ పెరిగితే శరీరంపై దురద వస్తుంది. ఇలాంటి చర్మ వ్యాధులతో బాధపడేవారు పుల్లని పదార్థాలు, పాలు, నువ్వులు, బెల్లం వంటి తీపి పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

New Update
Skin Rashes: ఒత్తిడి ఎక్కువైతే శరీరంలో జరిగే మార్పులు ఇవే..దీర్ఘకాలిక సమస్యలు తప్పవా..?

skin rashes problems: రకరకాల కారణాల వల్ల చర్మంపై దద్దుర్లు, బెందులు వస్తాయి. సీజనల్ ఎఫెక్ట్స్, మనం తినే ఆహార పదార్థాల వలన ఈ సమస్యలు రావచ్చు. సాధారణంగా ముఖం, చేతులు, మెడ, అరికాళ్లు, చేతులు, ప్రైవేట్ భాగాలలో దురద సమస్యలు వస్తాయి. అయితే.. ఎక్కువగా గాలిలో తేమ పెరిగితే శరీరంపై దురద వస్తుంది. అంతేకాదు కొన్నిసార్లు సింథటిక్ బట్టలు, వేడి, అధిక తేమ దురదకు కారణం అమవుతాయని చర్మ వైద్యులు చెబుతున్నారు. అయితే, మీ చర్మంపై ర్యాషెస్, దురద, దద్దుర్లు ఉన్నట్లయితే కొన్ని రకాల హోం రెమెడీస్‌తో కొంచం ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి: మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? మద్యం మెదడుపై ప్రభావం చూపుతుందని
ప్రస్తుతం కాలంలో ఒత్తిడి అనేది జీవితంలో ఒక భాగం అయింది. దీని వలన శరీరంపై కొందరిలో హార్ట్ వేగంగా కొట్టుకోవటం, మరికొందరు నిద్ర సమస్యల వలన చర్మంపై దద్దుర్ల వస్తాయి. స్ట్రెస్ కారణంగా వచ్చే దురద అసౌకర్యంగా, మానసికంగా దెబ్బతీసుకుంది. అయితే, మీ చర్మంపై ర్యాషెస్, దద్దుర్లు, దురద ఉంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తినొద్దని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. అసలు ఇలా ఎందుకు వస్తుంది..? స్ట్రెస్ అండ్ స్కిన్ రియాక్షన్ మధ్య సంబంధం ఏంటి..? మరి ఏ పదార్థాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్నిసార్లు దీర్ఘకాలిక సమస్య వచ్చే అవకాశం
మనకు ఒత్తిడి అధికంగా ఉంటే కార్టిసాల్, అడ్రినలిన్ సహా పలు రకాల రసాయనాలు, హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీంతో శరీరంలో కొన్ని మార్పులతో పాటు రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని సందర్భంగాల్లో చర్మానికి అలెర్జీ వంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. అంటే కెమికల్స్ రిలీజ్ చేయడం వల్ల వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి శరీరం సిద్ధంగా ఉన్నట్టు సూచన. ఇమ్యూనిటీ సిస్టమ్ దాడి చేయడం వలన అలెర్జీ, నొప్పితో కూడిన చిన్న చిన్న గడ్డలుగా ఉండే ఈ దురద వస్తుంది. దీని ప్రభావకం ఆరు వారాల పాటు తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు దీర్ఘకాలిక సమస్యకు దారి తీయవచ్చు. ఇలాంటి లక్షణాలను నియంత్రించడానికి కోల్డ్ కంప్రెస్, ఓరల్ యాంటి హిస్టామైన్‌లను తక్షణ ప్రథమ చికిత్సగా వాడిస్తేరు. సమస్య ఎక్కువైనా సందర్భాల్లో ఓరల్ స్టెరాయిడ్స్ ఇస్తారు. అయితే.. చర్మ వ్యాధులతో బాధపడేవారు పుల్లని పదార్థాలు, పాలు, నువ్వులు, బెల్లం వంటి తీపి పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని ఆయుర్వేదం వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి శరీరంలో వేడిని పెంచి దురద సమస్యను పెంచుతుంది.

Advertisment
తాజా కథనాలు