కేసీఆర్ తో సహా ఆ ప్రముఖ లీడర్లకు కార్లే లేవు.. ఈ సంగతి వెనుక సీక్రెట్ ఏంటో తెలుసా? ఇటీవల నామినేషన్లసమయంలో కేసీఆర్ తో సహా అనేక లీడర్లకు కార్లు లేవని విని జనం ఆశ్చర్యపోయారు. ఇన్ కం ట్యాక్స్ చిక్కులు, ఆర్టీవో ఆఫీసుకు వెళ్లే తీరిక లేకపోవడం, న్యూమరాలజీ నమ్మకాల వంటి కారణాలతో లీడర్లు సాధారణంగా తమ పేరుమీద కార్లు కొనేందుకు ఆసక్తి చూపరు. By Naren Kumar 15 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి పొద్దున లేస్తే పదిమందిని వెంటేసుకుని గడప దాటితే కారులోనే అడుగుపెట్టే నాయకులను చాలా మందినే చూస్తుంటాం. చోటామోటా లీడర్ల నుంచి మంత్రుల వరకూ కారును స్టేటస్ సింబల్లా భావిస్తున్న ఈ రోజుల్లో.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు సొంతంగా ఒక్క కారు కూడా లేదని చెప్తుండడంతో జనాలు నోరెళ్లబెడుతున్నారు. మంత్రులు సహా పలు పార్టీల కీలక నేతల ఎన్నికల అఫిడవిట్లూ ఇలానే ఉన్నాయి. నిజంగా వాళ్లకసలు కార్లే లేవా? కోట్ల ఆస్తులున్నా ఒక్క కారు కూడా ఎందుకు కొనుక్కోలేదు? మరి వాళ్ల ఇళ్ల ఎదుట ఉన్న విలాసవంతమైన కార్లన్నీ ఎవరివి?... సాధారణ ప్రజల్లో ఇలాంటి సందేహాలు రావడం సహజం. అసలు వారికి సొంత కార్లెందుకు లేవంటే... ఇది కూడా చదవండి: నేను ఇంకా ఎంతకాలం కొట్లాడాలి.. బోధన్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు! కేసులైతే పరుగులు పెట్టకుండా... కారుకు ఏదైనా ప్రమాదం జరిగినా, మరేమైనా వివాదంలో చిక్కుకున్నా న్యాయపరమైన చర్యల కోసం కారు యజమాని పేరే నమోదు చేస్తారు. ఆ టైంలో ఓనర్ కారులో ఉన్నా లేకున్నా కేసులు ఎదుర్కోక తప్పదు. కోర్టు వ్యవహారాలున్నప్పుడల్లా అన్ని పనులూ మానుకుని వాటి చుట్టూ తిరగడం వారికి సాధ్యపడదు. అందుకే ఈ తలనొప్పులన్నీ ఎందుకని చాలామంది కారును తమ పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఆసక్తి చూపరు. రాజకీయ నాయకులే కాదు.. అనేక విద్యా సంస్థల యజమానులు, పెద్దపెద్ద వ్యాపారులు, వివిధ రంగాల్లో ప్రముఖులూ ఇందుకు మినహాయింపేమీ కాదు. విద్యాసంస్థల అధినేతగా ఉండి అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఓ మంత్రి ఇటీవల ఎన్నికల నామినేషన్ వేశారు. ఆయన తనకు సొంత కారు లేదని అఫిడవిట్‌లో చూపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగలేక... రిజిస్ట్రేషన్ సమయంలో ఓనర్లు ఆర్టీఏ ఆఫీసులకు రావాల్సి ఉంటుంది. అంత సమయం వెచ్చించి రిజిస్ట్రేషన్ తంతు పూర్తయ్యే వరకూ వేచి చూసేంత సమయం సెలెబ్రిటీలకు ఉండకపోవచ్చు. ముహూర్త బలాలూ.. న్యూమరాలజీ కొందరి నమ్మకాలూ ఇందుకు కారణం. మంచి ముహూర్తం చూసుకుని ఎవరి పేరుతో కారు కొంటే మంచి జరుగుతుందో సంప్రదింపులు జరిపి వాహనాలు కొంటుంటారు. తమ ఆత్మీయుల పేరిట కూడా వాహనాలు కొంటుంటారు. ఇన్ కం టాక్స్ చిక్కుల్లేకుండా... కార్ల ఖర్చులు, బ్యాంకు రుణాల వ్యవహారాలతో తమకు సంబంధం లేదని, అన్నీ సంస్థల తరఫునే భరిస్తున్నట్లు చూపుతుంటారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పారిశ్రామిక వేత్తలు, విద్యా సంస్థల అధిపతులు దాదాపు ఈ పద్ధతినే పాటిస్తున్నారు. #kcr #mallareddy #telanganaelection2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి