Religious Beliefs of Ringing Bells: విశ్వాస పరిమళం... భక్తి వాసన, ఆలయ గంట శబ్దం ప్రతి వ్యక్తిని భక్తితో ముంచెత్తుతుంది. దేవుడిని నమ్మడం మన దేశ సంప్రదాయం మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి జీవితంలో అంతర్భాగంగా మారింది. భక్తి వాతావరణం ఆలోచనలను శుద్ధి చేస్తుంది. అలాగే ఆలయ గంట శబ్దం మనస్సుకు శాంతిని ఇస్తుంది. ఆ అనుభూతి ఆత్మను తాకుతుంది. అందుకే మనకు ఏ సుఖం దొరికినా, భగవంతుడితో మాట్లాడాల్సి వచ్చినా మన అడుగులు దేవాలయాల వైపు కదులుతాయి. ఆలయం చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ధార్మిక ప్రదేశంలో కచ్చితంగా గంటను ప్రతిష్ఠిస్తారు. సాధారణంగా గుడిలోకి వెళ్లగానే మొదటి గంట మోగిస్తారు దేవాలయాలలో గంటలు ప్రతిష్టించే సంప్రదాయం పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. అయితే గుడికి వెళ్ళే ముందు గంట ఎందుకు మోగిస్తారో తెలుసా?
పురాణాలు ఏం చెబుతున్నాయి?
గంట శబ్దం లేకుండా దేవతల హారతి సంపూర్ణం కాదని మత విశ్వాసం ఉంది. ఇళ్లలో కూడా పూజలు చేసేటప్పుడు గంటలు మోగుతాయి. గంట శబ్దం మనసుకు, మెదడుకు, శరీరానికి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. దేవాలయాల్లో హారతి జరిగినప్పుడల్లా గంటల శబ్దం ప్రజల మనస్సుల్లో భక్తిని మేల్కొల్పుతుంది. క్రమం తప్పకుండా హారతి ఇవ్వడం, గంటలు మోగించడం ద్వారా ఆలయంలో ప్రతిష్ఠించిన దేవతామూర్తుల విగ్రహాలు ఉత్తేజితమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి విగ్రహాలను పూజించడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
ఆలయంలో గంట మోగించడం ద్వారా మన పూర్వజన్మల పాపాలు కూడా నశిస్తాయని పురాణాల్లో చెప్పారు. సృష్టి ప్రారంభమైనప్పుడు వచ్చిన శబ్దం కూడా గంట శబ్దం నుంచి వెలువడుతుంది. దేవాలయాల వెలుపల ఉండే గంటలు కాలానికి ప్రతీక అని నమ్ముతారు. ఆలయ ప్రవేశ సమయంలో గంట మోగించడం ద్వారా మీ సందేశం నేరుగా భగవంతుడికి చేరుతుంది. మీ కోరికలు కూడా నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇంటర్‌నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఇది నిజమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రియ ఆధారాలు లేవు.
Also Read: ఈ నాలుగు చోట్ల ఇల్లు కట్టుకోవద్దు.. ఇబ్బందులు తప్పవు!