Attacks on Leaders: ఎన్నికల సమయంలోనే బడా నేతలపై దాడులు ఎందుకు? ఎన్నికల సమయంలో రాజకీయ నేతలపై అదీ పెద్ద నాయకులపై దాడులు జరగడం సాధారణంగా మారిపోయింది. నిన్న వైఎస్ జగన్ పై దాడి జరిగింది.గతంలో చంద్రబాబుపై నాలుగుసార్లు రాళ్ళ దాడులు జరిగాయి. ఇక జాతీయస్థాయిలో రాహుల్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ పై కూడా దాడుల ఘటనలు జరిగాయి. ఎందుకిలా? By KVD Varma 15 Apr 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Attacks on Leaders: ఎన్నికల సమయంలోనే బడా నేతలపై ఎందుకు దాడులు జరుగుతాయి? మొన్న జగన్, నిన్న చంద్రబాబు నాడు మమత, అంతకముందు రాహుల్, కేజ్రీవాల్..ఇలా టాప్ లీడర్లే దుండగుల టార్గెట్..! ఈ తరహా ఘటనలు ఇటివలీ కాలంలో బాగా పెరిగాయి.. దీనికి కారణాలేంటి? రాజకీయ నాయకులకు భద్రత లేదా? ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం! విజయవాడలో మేమంతా సిద్ధం యాత్ర సందర్భంగా ఏపీ సీఎం జగన్‌పై దుండగులు రాళ్లు రువ్వడం(Attacks on Leaders) దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఈ ఘటనలో ఆయన ఎడమ కన్ను దగ్గర గాయమైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌పై కూడా రాళ్ల దాడులు(Attacks on Leaders) జరగడం భయాన్ని రేపుతోంది. విశాఖ జిల్లా గాజువాకలో చంద్రబాబుపై, తెనాలిలో పవన్ పై దుండగులు రాళ్లు విసిరారు. చంద్రబాబుపై ఈ తరహా రాళ్ల దాడులు జరగడం ఇది నాలుగోసారి. గతేడాది ఆగస్టులో అంగళ్లులో చంద్రబాబుపై రాళ్లదాడి జరిగింది. 2022లో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలోనూ చంద్రబాబుపై దాడి(Attacks on Leaders) యత్నం జరిగింది. నందిగామలో చంద్రబాబు రోడ్ షో చేస్తుండగా ఓ దుండగుడు రాళ్లు విసిరాడు. 2021 తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా దుండగులు రాళ్లు విసిరారు. అటు రక్తంలో బెంగాల్ రాజకీయాలు తడవడం దశాబ్దాల నాటి నుంచి ఉంది. ఎన్నికల ముందు రక్తపాతం లేదా బౌతిక దాడులు(Attacks on Leaders) జరగడం బెంగాల్ రాజకీయాల సంప్రదాయం. 1999 - 2016 మధ్య పశ్చిమ బెంగాల్‌లో ప్రతి సంవత్సరం సగటున కనీసం 20 రాజకీయ హత్యలు జరిగాయని క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతోంది. అటు 2021లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమత బెనార్జీపై భౌతిక దాడి జరగడం సంచలనం రేపింది. ర్యాలీలో ఉండగా మమతను దుండుగుల కారుపైకి నెట్టారు. ఈ ఘటనలో మమత కాలికి గాయమైంది. చికిత్స తర్వాత ఆమె వీల్ చైర్ నుంచే ప్రచారంలో పాల్గొన్నారు. Also Read: సీఎం జగన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..పోలీసుల అదుపులో నలుగురు నిందితులు 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కాన్వాయ్ పై దాడి(Attacks on Leaders) జరిగింది. ఆయన వాహనంపై రాళ్లు రువ్వడంతో పాటు కారు అద్దాలు పగులగొట్టారు. అయితే ఈ ఘటనలో రాహుల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. అటు 2014లో అరవింద్ కేజ్రీవాల్‌పైనా దాడులు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయనపై సిరాతో దాడి చేశారు. కేజ్రీవాల్‌ను చెంపదెబ్బ కూడా కొట్టారు. భద్రతకు సంబంధించి కేజ్రీవాల్ ఆ సమయంలో బెదిరింపులను కూడా ఎదుర్కొన్నారు. అసలు సరిగ్గా ఎన్నికలకు ముందే ఈ తరహా దాడులు(Attacks on Leaders) ఎందుకు జరుగుతాయి? ఇదంతా ఎలక్షన్స్‌లో సానుభూతి కోసమేనన్న ప్రచారం జరుగుతుంటుంది. అయితే ఇలాంటి ఆరోపణలుకు సంబంధించి ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు. నిజానికి కొన్ని దాడులు స్పష్టమైన రాజకీయ ఉద్దేశాలను కలిగి ఉండవచ్చు. మరికొన్ని వ్యక్తిగత ప్రతీకారాలకు సంబంధించినవి కూడా ఉండొచ్చు. వీటిని తేలిగ్గా తీసుకోవడానికి అసలు ఉండదు. రాజకీయ నాయకుల భద్రత దేశానికి ఎంతో కీలకం. ప్రజాస్వామ్య సూత్రాలను పరిరక్షించడానికి ఇలాంటి దాడులను నిరోధించేలా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇలా దాడులకు(Attacks on Leaders) పాల్పడే వారి మనస్తత్వాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఏ సమస్యకైనా రూట్ కాజ్ తెలుసుకోని పరిష్కరించడమే ఉత్తమ మార్గం! #andhra-pradesh #attacks మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి