Age Gap Between Husband And Wife:పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి వయసు కంటే అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలని, ఒక మూడు నాలుగు సంవత్సరాల వయసు బేధం ఉండాలని పెద్దలు చెబుతారు. అసలు అమ్మాయి కంటే అబ్బాయి వయసు ఎందుకు ఎక్కువ ఉండాలి? భార్య కంటే భర్త ఎందుకు పెద్దవాడై ఉండాలి? అసలు ఎందుకు ఈ నియమం పెట్టారు? ఇద్దరూ సమాన వయస్సు, లేదా భర్త కంటే భార్య వయస్సు ఎక్కువ ఉంటే కలిగే నష్టం ఏమిటి? హిందూ ధర్మ శాస్త్రం వైవాహిక వ్యవస్థ గురించి ఏం చెప్తుంది? వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వివాహంలో వయసు చాలా ముఖ్యమైనది. కాబట్టి వివాహం చేసేటప్పుడు పెద్దలు ముఖ్యంగా చూసేది భార్య కంటే భర్త పెద్దవాడై ఉండాలి. ఎందుకంటే శరీరం దృష్ట్యా, మానసిక పరిణతి దృష్ట్యా స్త్రీలు మగవాళ్ళ కంటే భిన్నంగా ఉంటారు. శరీర పరిపక్వత విషయంలో మగవాళ్ళ కంటే ముందే స్త్రీలు ఉంటారు. చిన్నతనం నుండి స్త్రీ శరీరం అందుకు తగ్గట్టుగా ఉంటుంది. అంటే ఒక పురుషుడి కంటే స్త్రీకి వృద్ధాప్యం నాలుగు సంవత్సరాలు ముందుగా వస్తుంది. మగవాళ్లకు ఆడవాళ్ళ కంటే వృద్ధాప్యం ఆలస్యంగా వస్తుంది. కాబట్టి వివాహం చేసేటప్పుడు భార్య కంటే భర్త వయసు పెద్దదై ఉండాలని చెబుతారు.
Also Read: పిల్లలకు టీ, కాఫీలు ఇస్తున్నారా..? మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే..?
అలా కాకుండా సమాన వయసు వారిని చేసుకున్నా, వయసు తక్కువ మగవాళ్ళను చేసుకున్నా ఆడవాళ్లు త్వరగా ముసలివారవుతారని చెబుతారు. భర్త కంటే ముందే వృద్ధురాలైన భార్య భర్తకు ఎటువంటి సేవలు చేయలేదు. ఇక తనకంటే పెద్దదైన భార్యకు వృద్ధాప్యంలో భర్త సేవలు చేయలేడు. భార్య పాత్ర పోషించే మహిళలు సహనశీలురు. కుటుంబం కోసం తమ జీవితాన్ని అహరహం త్యాగం చేస్తారు. కాబట్టి భార్య కంటే భర్త పెద్దవాడు అయితేనే ఆ కాపురం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగుతుందని చెబుతారు.