AP Deputy Speaker : డిప్యూటీ స్పీకర్ ఎవరు?.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్

ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ అసెంబ్లీ అధికారులు జారీ చేయలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇస్తారని ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పంతం నానాజీ, లోకం మాధవిలో ఒకరికి ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

AP Deputy Speaker : డిప్యూటీ స్పీకర్ ఎవరు?.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్
New Update

Who Is AP Deputy Speaker : ఏపీ డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker) ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ అసెంబ్లీ అధికారులు జారీ చేయలేదు. కాగా స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఏకగ్రీవ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Meetings) ఉప సభాపతి ఎన్నిక జరగనుంది. ఈ పదవి ఎవరికివ్వాలనే దానిపై కూటమిలో ఇంకా స్పష్టత రాలేదు. జులైలో జరిగే సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ ను అసెంబ్లీలో ఎన్నుకోనున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన (Janasena) కు ఇస్తారని ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. డిప్యూటీ స్పీకర్ ఎంపికపై నిన్న ఎమ్మెల్యేలతో చర్చించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan). పంతం నానాజీ, లోకం మాధవిలో ఒకరికి ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Also Read : ప్రభుత్వాలు మారితే నిర్మాణాలు కూల్చివేయడమేనా !

#pawan-kalyan #ayyanna-patrudu #assembly-meeting #ap-deputy-speaker
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe