AAP Legislative Party Meeting: ఢిల్లీలో ఆప్ కొన్ని రోజులుగా ఒడిదుడుకులను ఎదుర్కోంటోంది. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. జైల్లో ఉన్నంతకాలం తానే ఢిల్లీకి సీఎంగా ఉండి…అక్కడి నుంచే అన్ని కార్యలపాలను నిర్వహించారు కేజ్రీవాల్. కానీ ఇప్పుడు ఆయన తన పదవికి రాజీనామాచేయాలని అనూహ్యంగా నిర్ణయించుకున్నారు. రేపు కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో రేపు సాయంత్రం 4.30 గంటలకు ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలవనున్నారు. మరోవైపు రేపు ఉదయం 1 గంటలకు ఆప శాసనసభా పక్షం సమావేశం అవుతోంది. ఇందులో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ స్థానంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు ఆప్ లీడర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో మినిస్టర్ అతిషి ఒకరు కాగా మిగతా వారు ఎమ్మెల్యే సౌరభ్ చటర్జీ, రాఘవ్ చద్దాలు ఉన్నారు
పూర్తిగా చదవండి..Delhi: రేపు ఆప్ శాసనసభా పక్షం సమావేశం…కొత్త సీఎం ఎవరో?
ఢిల్లీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో అక్కడ రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో రేపు ఆప్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సీఎం ఎవరో అనే అంశం చర్చకు రానుంది.
Translate this News: