Who is Mohammed Asfan : మంచి ఉద్యోగం(Good Job) వస్తుందని బతుకుపై ఆశతో, కుటుంబాన్ని పోషించవచ్చన్న ఆలోచనతో విదేశాలకు వెళ్తున్న నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రష్యా(Russia) వెళ్లేవారు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. రష్యాలో జాబ్ ఇప్పిస్తామని ఎవరైనా చెబితే వెంటనే నమ్మకండి. ఎందుకంటే అక్కడికి వెళ్లిన తర్వాత రష్యా యుద్ధంలో పాల్గొనే చేస్తోంది. ట్రైనింగ్ ఇచ్చి అమాయకులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా ఓ హైదరాబాద్(Hyderabad) రష్యా-యుక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War) లో ప్రాణాలు విడడం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మహ్మద్ అస్ఫాన్(Mohammed Asfan) అనే హైదరాబాదీ మరణవార్త దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంతకీ ఎవరీ మహ్మద్ అస్ఫాన్?
మహ్మద్ అస్ఫాన్ ఎవరు?
అస్ఫాన్ హైదరాబాద్‌లోని ఓ క్లాత్ షోరూమ్‌లో పనిచేసేవాడు. 'బాబా వ్లాగ్స్(Baba Vlogs)' అనే యూట్యూబ్ ఛానెల్(YouTube Channel) ని నడుపుతున్న దుబాయ్(Dubai) కి చెందిన ఏజెంట్ అస్ఫాన్‌ను మోసం చేసినట్టుగా అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అస్ఫాన్ ఫ్యామిలీ చెబుతున్నట్టుగానే ఓ వీడియోలో దేశం కోసం వర్క్ పర్మిట్‌లను పొందడంలో ప్రజలకు సహాయం చేయడం గురించి ఆ వ్లాగర్ మాట్లాడాడు. అస్ఫాన్ సోదరుడు ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు బట్టి ఈ మోసానికి పాల్పడింది బాబా వ్లాగ్స్ అని అర్థమవుతోంది. ఇమ్రాన్ ప్రకారం.. ఏజెంట్లలో ఒకరికి దుబాయ్‌లో కార్యాలయం ఉంది. అతను బాబా వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఇతను అస్ఫాన్‌తో పాటు ముంబైకి చెందిన మరో ఇద్దరి దగ్గర రూ.3 లక్షలు తీసుకున్నాడు. మాస్కో చేరుకున్న తర్వాత, మహ్మద్ అస్ఫాన్, మరో ఇద్దరు రష్యన్ భాషలో ఒక డాక్యుమెంట్‌పై సంతకం చేశారు. రష్యా సైన్యంలో హెల్పర్‌గా రిక్రూట్‌మెంట్ చేసుకుంది పుతిన్ ప్రభుత్వం. ఈ విషయం అస్ఫాన్‌కు లేట్‌గా అర్థమైంది.
ఆర్మీలో శిక్షణ ఇచ్చారు?
తనకు ఆయుధాలు వాడేందుకు శిక్షణ ఇస్తున్నట్లు అస్ఫాన్ తనతో చెప్పాడని మహ్మద్ ఇమ్రాన్ తెలిపారు. అదంతా ఉద్యోగంలో భాగమని ఏజెంట్లు మళ్లీ అస్ఫాన్‌కు అబద్ధం చెప్పారట. తర్వాత యువకులను రష్యా-యుక్రెయిన్ సరిహద్దులకు తీసుకెళ్లారు. ఇటీవల ఏజెంట్లను ఇమ్రాన్ సంప్రదించారు. అయితే అస్ఫాన్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిందని తనకు ఏజెంట్లు చెప్పారని ఇమ్రాన్ అంటున్నాడు. అస్ఫాన్ గాయపడ్డాడని కూడా ఏజెంట్లు చెప్పారన్నారు. కొన్ని రోజులుగా మహ్మద్ అస్ఫాన్ కుటుంబం ఈ విషయమై తమను పదే పదే సంప్రదిస్తోందని AIMIM వర్గాలు వార్తా సంస్థ PTIకి తెలిపాయి. దీంతో అసదుద్దీన్ ఒవైసీ మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. అస్ఫాన్ మృతి గురించి మాస్కోలోని భారత రాయబార కార్యాలయ అధికారి అసదుద్దీన్ ఒవైసీకి సమాచారం అందించారు. ఇక తాజాగా అస్ఫాన్ చనిపోయినట్టు రష్యానే స్వయంగా ప్రకటించింది.
యువతను సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి రష్యా ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఒవైసీ ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi), విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లను గతంలోనే అభ్యర్థించారు. దేశం నలుమూలల నుంచి రెండు బ్యాచ్‌లను రష్యాకు పంపినట్లు ఆయన చెబుతున్నారు. ఈ బ్యాచ్‌లో తెలంగాణకు చెందిన మరో యువకుడు కూడా ఉన్నాడు.
Also Read : పొత్తు లేనట్టేనా? తేల్చేసిన పురందేశ్వరి!