ఆమె మద్దతు టీమిండియాకే.. సస్పెన్స్ కు తెరదించిన వాజ్మా

దేశాల ఎల్లలు దాటి అభిమానులను సొంతం చేసుకున్న వాజ్మా ఆయూబీ వరల్డ్ కప్ ఫైనల్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ కాబోతోంది. తుది సమరంలో భారత్ కే మద్దతిస్తున్నట్లు ప్రకటించిన ఈ ఆఫ్ఘాన్ సోషల్ మీడియా క్వీన్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది.

ఆమె మద్దతు టీమిండియాకే.. సస్పెన్స్ కు తెరదించిన వాజ్మా
New Update

ODI World Cup 2023 వాజ్మా అయూబీ.. ఏ స్టార్‌ క్రికెటర్‌కూ ఏమాత్రం తీసిపోని ఫాలోయింగ్‌ ఇప్పుడామె సొంతం. తమ జట్టు ఎక్కడ క్రికెట్‌ ఆడుతున్నా అక్కడ వాలిపోయే ఈ ఆఫ్ఘన్‌ సోషల్‌ మీడియా క్వీన్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత్‌కు జై కొట్టింది. వాజ్మా ఏ టీంకు సపోర్ట్‌ చేస్తుందోనని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు క్లారిటీ ఇచ్చేసింది. కోహ్లీ నంబ‌ర్‌తో ఉన్న జెర్సీ ధ‌రించిన ఫొటోను ట్వీట్‌ చేసి భారత అభిమానుల మనుసు గెలుచుకుంది.

ఇది కూడా చదవండి: ర్యాంకింగ్ లో టాపు, వరల్డ్ కప్ లో తోపు: సెంటిమెంట్ వర్కౌట్ అయితే కప్పు మనదే!

ఎవరీ వాజ్మా?

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని కుందుజ్‌లో పుట్టిన వాజ్మా పేద్ద క్రికెట్‌ ఫ్యాన్‌. ఎక్కడ మ్యాచ్‌ జరిగినా ఆఫ్ఘాన్‌ జెండాతో అక్కడ వాలిపోతుంది. అందం, ఆటిట్యూడ్‌ కలగలిసి సరిహద్దులకు అతీతమైన అభిమానులను సొంతం చేసుకుంది. చిన్నప్పుడే తన కుటుంబం అమెరికా వెళ్లడంతో కొలరాడోలో పెరిగింది. 'లామన్‌' బ్రాండ్‌తో దుస్తులను మార్కెట్‌లోకి తెచ్చి ఇప్పుడు వ్యాపార ప్రపంచంలోనూ మెరుస్తోంది. సోషల్‌ యాక్టివిస్ట్‌గా కూడా క్రియాశీలకంగా ఉంది. గతేడాది జరిగిన టీ 20 ఆసియా కప్‌లో మెరుపుతీగలా ఫ్యాన్స్‌ను తనవైపు తిప్పుకున్న వాజ్మా ఇప్పుడు భారత్‌లోనే ఉంది. సెమీ ఫైనల్ మ్యాచులో స్టేడియంలో కనిపించింది. టీమిండియాకు సపోర్ట్‌గా ఫైనల్‌ మ్యాచ్‌కు కూడా స్టేడియానికి వస్తుందట!

ఇది కూడా చదవండి: ‘విరాట్’ ప్రదర్శనను సెంటిమెంట్ అడ్డుకుంటుందా!: అభిమానుల్లో కలవరం

#icc-world-cup-india-vs-australia #who-is-wazma-ayibi #wazma-ayubhi #icc-world-cup-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe