Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సూపర్ ట్విస్ట్ వచ్చింది. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఊహించని విధంగా విజయపథంలోకి వచ్చారు. అమెరికాలోని అయోవా రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ (Republican Party) నుంచి అభ్యర్థిత్వం కోసం జరిగిన ఎన్నికల్లో ఆయన 51% ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. అయితే, ఇక్కడ భారత్ కు సంబంధించి ఒక లింక్ ఉంది. అది వివేక్ రామస్వామి. ఆయన కూడా ఈ ఎన్నికల్లో పోటీ పడ్డారు. అయితే, ఇందులో డొనాల్డ్ ట్రంప్ అఖండ మెజారిటీతో గెలుపొందారు. CNN ప్రకారం, ఈ రేసులో వివేక్ నాల్గవ స్థానంలో నిలిచాడు.
వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)అధ్యక్ష అభ్యర్థిగా రేసు నుంచి బయటకు వచ్చేశారు. తాను బరిలో లేనని ఆయన స్పష్టం చేశేసారు. ఈ ఎన్నికల ముందు వరకూ కూడా వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US President Election) పోటీ కచ్చితంగా చేస్తారనీ.. ఆయన అమెరికా అధ్యక్ష పదవికి కీలక పోటీదారుడనీ.. అధ్యక్షుడిగా గెలిచే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తూ వచ్చారు. అక్కడి మీడియా కూడా వివేక్ ను ఆవిధంగానే ఫోకస్ చేస్తూ వచ్చింది. కానీ, అనూహ్యంగా ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన ట్రంప్ తో కలిసి ఆయనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారని న్యూయార్క్ టైమ్స్ ప్రకారం తెలుస్తోంది.
ఇదిలా ఉంటె.. వివేక్ ఓటమి తరువాత ఆయన వార్తలు చూస్తున్న వారు అందరికీ ఆయన ఎవరు అనే ఆసక్తి ఏర్పడింది. భారత్ లో కూడా అందరూ వివేక్ రామస్వామి గురించి తెలుసుకోవడం కోసం ఉత్సాహం చూపిస్తున్నారు. ఒక్కసారిగా ఆయన పేరు భారత్ లో ట్రేండింగ్ లో ఉంది. అందుకే, ఇప్పుడు మీకోసం వివేక్ రామస్వామి గురించి చెప్పబోతున్నాం.
ఎవరీ వివేక్ రామస్వామి..
వివేక్ రామస్వామి ఒక అమెరికన్ కంపెనీ వ్యవస్థాపకుడు. ఆయన కంపెనీ పేరు రోవాంట్ సైన్సెస్. దీనికి అయన సీఈవో గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇది ఒక ఔషధ పరిశ్రమ. కొత్తరకాల మందులను కనిపెట్టడం.. అభివృద్ధిలోకి తీసుకురావడం.. వాటిని అందుబాటులోకి తీసుకురావడం చేస్తుంటుంది. ఫిబ్రవరి 2023లో, రామస్వామి 2024 యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
వివేక్ రామస్వామి తొలి జీవితం
వివేక్ రామస్వామి ఒహియోలోని సిన్సినాటిలో ఆగస్టు 9, 1985న భారతీయ వలస తల్లిదండ్రులకు జన్మించాడు. అతని తండ్రి, V. గణపతి రామస్వామి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్ నుంచి పట్టభద్రుడయ్యాడు. జనరల్ ఎలక్ట్రిక్ కోసం ఇంజనీర్ అండ్ పేటెంట్ అటార్నీగా పనిచేశాడు. అతని తల్లి, గీతా రామస్వామి, మైసూర్ మెడికల్ కాలేజ్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి డిగ్రీ తీసుకుని వృద్ధాప్య మానసిక వైద్యురాలిగా పనిచేశారు.
వివేక్ రామస్వామి ఎనిమిదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. తర్వాత సిన్సినాటిలోని సెయింట్ జేవియర్ హై స్కూల్‌లో చదివాడు. ఇక 2007లో, రామస్వామి హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి జీవశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌తో సుమ్మ కమ్ లాడ్ పట్టభద్రుడయ్యాడు. అతను ఫై బీటా కప్పా.. హార్వర్డ్ పొలిటికల్ యూనియన్ సభ్యుడు మరియు తరువాతి అధ్యక్షుడిగా పనిచేశాడు.
Also Read: ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఎఫ్‌ఐఆర్ తప్పనిసరిగా ఉండాలా?
2011లో, రామస్వామి పాల్ & డైసీ సోరోస్ ఫెలోషిప్స్ ఫర్ న్యూ అమెరికన్స్ నుండి పోస్ట్-గ్రాడ్యుయేట్ ఫెలోషిప్‌ను అందుకున్నాడు. అతను యేల్ లా స్కూల్ లో చేరాడు. అప్పటికే సంపన్నుడిగా మారాడు, లా స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యే ముందు అతని నికర విలువ సుమారు $15 మిలియన్లు. అతను యేల్‌లో 2013లో జ్యూరిస్ డాక్టర్‌ని సంపాదించాడు.
వివేక్ రామస్వామి కెరీర్ ఇదీ..
హార్వర్డ్ నుండి పట్టభద్రుడయ్యాక, రామస్వామి (Vivek Ramaswamy)హెడ్జ్ ఫండ్ QVTలో చేరాడు. అక్కడ అతను ఫార్మాస్యూటికల్ పెట్టుబడులలో నైపుణ్యం సాధించాడు. ఏడు సంవత్సరాలలో, అతను $7 మిలియన్లు సంపాదించాడు. 28 సంవత్సరాల వయస్సులో దానికి భాగస్వామి అయ్యాడు. ఈ సమయంలో,నే అతను థ్రోట్ సర్జన్ అపూర్వను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
వివేక్ QVtని విడిచిపెట్టి, 2014లో తన సంస్థ Roivant Sciences ని ప్రారంభించాడు. ఇటీవలి సంవత్సరాలలో అత్యంత విజయవంతమైన బయోటెక్ కంపెనీలలో Roivant Sciences ఒకటిగా మారింది. కంపెనీ 4 రౌండ్ల నుంచి $1.3 బిలియన్లకు పైగా నిధులను సేకరించింది. వెన్నెముక కండరాల క్షీణత కోసం Axovant జన్యు చికిత్సల AVXS-101తో సహా అనేక ఔషధాలను అభివృద్ధి చేసి మార్కెటింగ్ చేసింది ఈ కంపెనీ.
రాజకీయాల్లో..
వివేక్ రామస్వామి అనూహ్యంగా 2023 ఫిబ్రవరిలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. దీంతో అదే పార్టీలోని మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ప్రధాన పోటీదారునిగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే, అయోవా (Iowa) రాష్ట్రంలో అభ్యర్థిత్వం కోసం ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వివేక్ రామస్వామిని తీవ్రంగా టార్గెట్ చేశారు. వివేక్ రామస్వామిని మోసగాడు, మోసగాడు అని ట్రంప్ సూటిగా వ్యాఖ్యానించారు. ఒక ప్రకటనలో, డొనాల్డ్ ట్రంప్ రామస్వామికి మద్దతు ఇవ్వవద్దని తన మద్దతుదారులను కూడా హెచ్చరించారు. వివేక్‌కు ఓటు వేస్తే ప్రత్యర్థి పార్టీకి ఓటు వేసినట్లే అవుతుందని ట్రంప్ అన్నారు. ఈ ప్రచారం ఫలించింది. దీంతో వివేక్ రామస్వామి ఈ ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలవాల్సి వచ్చింది. తన ఓటమిని హుందాగా అంగీకరించిన వివేక్ నేను రాష్ట్రపతిని అయ్యే అవకాశం లేదు, అందుకే నా ప్రచారాన్ని ముగించుకుంటున్నానని చెప్పారు.
Watch this interesting video
o: