/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Revanth-Reddy-1.png)
Revanth Reddy: తెలంగాణలో పదేళ్లుగా అధికారంలో ఉండి.. మూడోసారి కూడా అధికారం సాధించాలని కలలు కన్న బీఆర్ఎస్ ఆశల మీద ఆవిరి చల్లాయి ఈ ఎన్నికలు. దీనికి కారణం ఒక్కడే. దేశంలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో మూడింటిలో ఓటమి మూటకట్టుకున్న కాంగ్రెస్.. తెలంగాణలో విజయతీరాలకు చేరిందంటే కారణం కూడా ఆ ఒక్కడే. ఆయనే.. రేవంత్ రెడ్డి. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ సూపర్ స్టార్. దేశవ్యాప్తంగా ఆయన విజయంగానే దీనిని చూస్తున్నారు. రేపు ఆయన తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓడిపోయిన తర్వాత తెలంగాణలో గెలుపు ద్వారా.. అదీ బీఆర్ఎస్ లాంటి కొండను ఢీ కొట్టి విజయం సాధించిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ సూపర్ స్టార్ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాస్తవానికి నవంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా, మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, ఈ విజయం తర్వాత, రామ్ గోపాల్ వర్మ కూడా రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ప్రశంసించడం కనిపించింది. అతను ఒక ట్వీట్ కూడా షేర్ చేశాడు. ఇది బాగా వైరల్ అయ్యింది.
రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో చాలా ఇంట్రస్టింగ్ టాపిక్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పడు ట్రెండింగ్ లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందులో ఒక విషయం బాగా ఆకట్టుకుంటోంది ప్రజల్ని. రేవంత్ రెడ్డికి రాజకీయాలతో పాటు సినిమాలంటే కూడా చాలా ఇష్టం. ఇప్పుడు దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో రేవంత్ రెడ్డిని మీరు ఇష్టపడే టాలీవుడ్ నటుడు(Revanth Reddy Favourite Hero) ఎవరు? అని ఒక రిపోర్టర్ అడుగుతున్నాడు. దానికి బదులిస్తూ తాను ఇప్పుడు ఎక్కువ సినిమాలు చూడటం లేదు.. కానీ, తనకు సూపర్ స్టార్ కృష్ణ అంటే చాలా ఇష్టమని చెప్పారు.
మరో వందేళ్లు అభిమానులనుండి అభినందనలు అందుకో నటశేఖరా...!#SuperStarKrishna@urstrulyMahesh pic.twitter.com/C251QA2suo
— Revanth Reddy (@revanth_anumula) May 31, 2021
ఈ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇంకా మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ అంటే చాలా ఇష్టమని, ఆయన సినిమాలు కూడా చూసేవాడినని అన్నారు. కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో ఉండిపోయారు. ఈ సూపర్‌స్టార్‌కు కూడా తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు ఉంది. సౌత్ 'జేమ్స్ బాండ్'గా పేరు తెచ్చుకున్న కృష్ణ తనయుడు మహేష్ బాబు కూడా దక్షిణాదిన సూపర్ స్టార్ గా ఉన్నారు. సాధారణంగా సూపర్ స్టార్ల పేర్లు రాగానే అందరికి రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ గుర్తొస్తుంటారు కానీ తెలంగాణాలో కాంగ్రెస్ కి సూపర్ స్టార్ గా ఎదిగిన ఘనత సాధించిన రేవంత్ రెడ్డికి మన తెలుగు సూపర్ స్టార్ కృష్ణ అంటే ఇష్టం అని తెలిసి అందరూ సూపర్ స్టార్స్ కి సూపర్ స్టార్సే నచ్చుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Watch this interesting Video: