Life Tips: మంచివారెవరు.. ముంచేవారెవరు.. గుర్తించడం ఎలా..?

జీవితంలో ఎవరు మంచివాళ్లు, మనల్ని ముంచేవాళ్లు ఎవరు అనేది గుర్తించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. వీలైనంత వరకు పర్సనల్ విషయాలు, కుటుంబ వివరాలు, బంధువుల ముచ్చట్లు, డబ్బులకు సంబంధించిన అంశాలను ఎవరితో షేర్‌ చేసుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు.

New Update
Life Tips: మంచివారెవరు.. ముంచేవారెవరు.. గుర్తించడం ఎలా..?

Life Tips: జీవితంలో ఎవరు మంచివాళ్లు, మనల్ని ముంచేవాళ్లు ఎవరు అనేది గుర్తించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎల్లప్పుడూ మనతో ఉంటూనే మనకే వెన్నుపోటు పోడిచేవారు కూడా ఉంటారు. మిత్రుల్లా నటిస్తూ శత్రువుల్లా ప్రవర్తిస్తుంటారు. ఈ విషయాలను మనం అంత తొందరగా గుర్తించలేం, అందరినీ గుడ్డిగా నమ్మే అలవాటు ఇందుకు కారణం. ఒక వ్యక్తి మనకు మంచి చేస్తాడనుకోవడం ఈ రోజుల్లో పిచ్చి ఆలోచన. మంచి చేసేవాళ్ల కంటే చెడు చేసేవాళ్లే మన చుట్టూ ఉంటారని గుర్తుంచుకోండి. అలాగని అందరూ చెడు చేస్తారని కాదు.. కొందరు ఉంటారంతే. మంచివాళ్లు శత్రువులకైనా మంచి చేస్తారు.. చెడ్డవాళ్లు తోడ బుట్టిన వాళ్లను కూడా నిలువునా ముంచేస్తారని పెద్దలు చెబుతూ ఉంటారు.

కళ్ల ముందే నిదర్శనాలు:

ఈ కాలంలో మంచివాళ్లను దూరంచేసుకుని చివరికి మనల్ని మోసం చేసేవాళ్లకే ప్రాధాన్య ఇస్తూ చివరికి మనం మునిగిపోతుంటాం. టెక్నాలజీ బాగా పెరగడంతో మంచితనం ముసుగులో అందరినీ మోసం చేసేవాళ్లు ఎక్కువయిపోయారు. నమ్మించి గొంతుకోయడం అలవాటుగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న అత్యాచారాలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అమ్మాయిని ప్రేమపేరుతో నమ్మించి స్నేహితులతో కలిసి బలాత్కారం చేసిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒకరికి సహాయం చేస్తున్నట్టు నటించి వారి అకౌంట్ల నుంచి డబ్బులు కాజేయడం చూస్తూనే ఉన్నాం. కొందరు డబ్బు కోసం నానాగడ్డీ తింటుంటే మరికొందరు మూర్ఖత్వంతో ఎందరినో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా నష్టపెడుతున్నారు.

సైలెన్స్‌ ప్లీజ్‌:

ఇలాంటి వాళ్లని ముందుగానే పసిగట్టలేక చాలా మంది మోసపోయి లబోదిబోమంటున్నారు. మనం జీవితంలో చేసే మొదటి తప్పు ఏంటంటే అందరినీ మన అనుకొని గుడ్డిగా నమ్మటం. అంతేకాకుండా వారికి అన్ని విషయాలు చెప్పడం. ఇలా చెప్పడం వలన వారిలో చెడు ఆలోచనలు ఎక్కువైపోయి చివరికి మనకే నష్టం చేయాలని చూస్తుంటారు. అందుకే వీలైనంత వరకు మీ పర్సనల్ విషయాలు, కుటుంబ వివరాలు, బంధువుల ముచ్చట్లు, డబ్బులకు సంబంధించిన అంశాలను ఎవరితో షేర్‌ చేసుకోకపోవడమే ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. మనపాటికి మనం ఉంటే ఎలాంటి మోసాలకు తావు ఉండదని సూచనలు ఇస్తున్నారు. అందుకే ఇలాంటి విషయాలను మనసులో పెట్టుకుని నీకు నువ్వే పోరాడితే కొంతవరకు అయినా శత్రువుల బారి నుంచి తప్పించుకోవచ్చంటున్నారు.

ఇది కూడా చదవండి: ఈ మసాలాతో క్షణంలో కడుపులో గ్యాస్‌ మాయం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు