కొంత కాలం ముందు వరకు నీటి సౌకర్యం అంతగా లేని రోజుల్లో ప్రజలు బావులు మీద ఆధార పడితే..కొంత కాలం క్రితం తరువాత బోరు పంపుల మీద ఆధారపడేవారు. బోరు నుంచి మంచి నీరు కానీ..ఉప్పు నీరు..కొంచెం చప్పటి నీరు కానీ వచ్చేవి. కొంత కాలం తరువాత పైపులు రావడంతో బోరు పంపుల వినియోగం తగ్గింది.
ఇంకా కొన్ని చోట్ల వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే బోరు పంపు నుంచి సాధారణంగా నీరు రావడమే మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం బోరు పంపు కొడితే పాలు ఉబికి వస్తున్నాయి. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. ఈ వింతను చూడటానికి ప్రజలు ఎగబడుతున్నారు.
వచ్చిన వాళ్లు పాలు రావడం చూసి బాటిళ్లు, బిందెలు, క్యాన్లలో నింపుకుని పోతున్నారు. ఇంతకీ ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందంటే..ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఓ చేతి పంపు నుంచి నీళ్లకు బదులు పాలు ( తెల్లటి ద్రవం) రావడం చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు.
తెల్లటి ద్రవాన్ని చూసి పాలే అనుకుని బాటిళ్లు, బిందెలు, క్యాన్లతో నింపుకుంటున్నారు. అక్కడి వారు కొందరు దీనికి సంబంధించిన వీడియోను ఒకదానిని సోషల్ మీడియాలోఓ పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.దీంతో ఈ విషయం కాస్త ప్రభుత్వాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు బోరు నుంచి వస్తున్న ఈ తెల్లటి ద్రవం నిజంగా పాలా..లేక ఏదైనా రసాయనమా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ద్రవాన్ని ల్యాబ్ కి పంపి ..పరీక్షిస్తే గానీ అసలు విషయం ఏంటనేది తెలియదు.
Also read: కారు కొనాలనుకుంటున్న వారికి షాక్.. జనవరి నుంచి భారీగా పెరగనున్న ధరలు.. ఎంతంటే?