Paytm: ఆర్బీఐ పుణ్యమా అంటూ ఈ యాప్‌ లకు భారీగా పెరిగిన డిమాండ్‌!

ఎప్పుడైతే పేటీఎం బ్యాంక్‌ సేవలను ఆర్బీఐ నిలిపివేసిందే..ఇతర ఆన్‌ లైన్ చెల్లింపు యాప్‌ లు బాగా ఉపయోగించుకుంటున్నాయి.ఫోన్ పే, బీమ్‌, గూగుల్ పై వంటి ఇతర యాప్‌ ల వినియోగం బాగా పెరిగింది. వీటిని ప్రజలు ఎక్కువగా డౌన్ లోడ్‌ చేసినట్లు సమాచారం.

Paytm: ఆర్బీఐ  పుణ్యమా అంటూ ఈ యాప్‌ లకు భారీగా పెరిగిన డిమాండ్‌!
New Update

Paytm: పేటీయం పేమెంట్‌ బ్యాంక్‌ పై ఆర్బీఐ (RBI) తీసుకున్న నిర్ణయం వల్ల దాని వినియోగదారులందరూ గందరగోళానికి గురయ్యారు. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం పేటీయం ఉపయోగిస్తున్న వారు ఫిబ్రవరి 29 తరువాత దాని సేవలు పూర్తి స్థాయిలో అందుకోలేరని తెలిపింది. అంతేకాకుండా ఫాస్ట్‌ ట్యాగ్‌ (Fast Tag) పేటీయం పేమెంట్‌ బ్యాంక్‌కి లింక్ అయితే, దానిని కూడా ఉపయోగించలేరని ఆర్బీఐ పేర్కొంది.

ఈ క్రమంలోనే పేటీయం పేమెంట్ బ్యాంక్ (Paytm Payment Bank) బ్యాంకింగ్ సేవలను ఆర్బీఐ నిలిపివేసింది. ఎప్పుడైతే పేటీఎం బ్యాంక్‌ సేవలను ఆర్బీఐ నిలిపివేసిందే..ఇతర ఆన్‌ లైన్ చెల్లింపు యాప్‌ లు బాగా ఉపయోగించుకుంటున్నాయి. పేటీయం పేమెంట్ బ్యాంక్‌ సేవలపై నిషేధం వార్తలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పటి నుంచి చాలా మంది పేటీయం ను తమ ఫోన్ల నుంచి తొలగించడం మొదలు పెట్టారు.

దీంతో ఫోన్ పే, బీమ్‌, గూగుల్ పై వంటి ఇతర యాప్‌ ల వినియోగం బాగా పెరిగింది. వీటిని ప్రజలు ఎక్కువగా డౌన్ లోడ్‌ చేసినట్లు సమాచారం. పేటీయం భారతదేశంలో పెద్ద మార్కెట్‌ను కలిగి ఉంది. ఆన్‌లైన్ చెల్లింపుల విభాగంలోపేటీయం (Paytm) ఆధిపత్యం చెలాయించింది.

పేటీయం హవా వల్ల ఇతర ఆన్‌లైన్ చెల్లింపుల యాప్‌ ల వారు తమ యాప్‌ లను వృధ్దిలోనికి తెచ్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ పేటీయం  పేమెంట్ బ్యాంక్‌పై నిషేధం వార్తలు వచ్చిన వెంటనే, ఫోన్‌ పే (PhonePe) , బీమ్‌ (BHIM) , గూగుల్‌ పే (Google Pay ) ఒక్కసారిగా తెరమీదకు వచ్చి ప్రసిద్ధి చెందాయి.

ఏ యాప్ ఇప్పటి వరకు ఎంత లాభపడింది?

జనవరి 31న ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం తర్వాత ఫిబ్రవరి 3న 2.79 లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఫోన్ పే డౌన్‌లోడ్ చేసుకున్నారు. అంతకుముందు జనవరి 27న 1.92 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ విధంగా,ఫోన్‌ పే (PhonePe) వినియోగదారులలో 24 శాతం పెరుగుదల నమోదైంది.

బీమ్‌ (BHIM UPI) భారీ ప్రయోజనాలను పొందింది

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం, పేటీయం (Paytm) సంక్షోభం నుండి బీమ్‌ BHIM యాప్ కూడా చాలా లాభపడింది. బీమ్‌ యూపీఐ (BHIM UPI) జనవరి 27న 1.11 లక్షల డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది, అయితే ఫిబ్రవరి 3న దాని డౌన్‌లోడ్ సంఖ్య అనేక రెట్లు పెరిగింది. గత వారం, బీమ్‌ యూపీఐ  ని దాదాపు 3.97 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు, అయితే ఫిబ్రవరి 3 వారాంతంలో, దాని డౌన్‌లోడ్ సంఖ్య 5.93 లక్షలకు చేరుకుంది. అంటే, ఆర్బీఐ (RBI) నిర్ణయం తర్వాత, BHIM UPI వినియోగదారుల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగింది.

Google Pay వేగం నెమ్మదిగా ఉంది
ఇక గూగుల్ పే (Google Pay) గురించి మాట్లాడినట్లయితే, ఫోన్‌ పే, బీమ్‌ తో పోల్చితే దాని యూజర్ బేస్ పెరుగుదల వేగం కొంచెం నెమ్మదిగా ఉంది. జనవరి 27న Google Payని 1.04 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఫిబ్రవరి 3న ఈ యాప్‌ను 1.09 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అంటే జనవరి 31, ఫిబ్రవరి 3 మధ్య, Google Pay వినియోగదారులలో దాదాపు 4 శాతం పెరుగుదల ఉంది.

Also read: ప్రేమ యాత్రలకు పారిస్‌…ఇటలీ ఏలనో..మన ఉదయ్‌పూర్‌ చెంతనుండగా!

#paytm #google-pay #phonepay #bhim-upi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe