Ugadi Festival 2024 : భారతీయ సంప్రదాయం ప్రకారం.. ఒక ఏడాదిలో ఎన్నో రకాల పండగలు వస్తుంటాయి. ఆ పండగల రోజున ఆ పండగకు సంబంధించిన దేవుళ్లను, దేవతలను ప్రత్యేకంగా పూజించడం, తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం ఆచారం. ఈ క్రమంలో తెలుగువారంతా జరుపుకునే ప్రత్యేకమైన పండుగ ఉంది. సంవత్సరం ఆరంభంలో వచ్చే ఈ పండుగ అంటే ఎంతో మంది ఇష్టపడతారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం.. ఉగాది(Ugadi) రోజున కొత్త సంవత్సరం(New Year) ప్రారంభమైనట్లు భావించడం.. అనాదిగా వస్తోన్న ఆచారం. ఉగాది కంటే ముందుగా అందరికీ.. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం గుర్తుకువస్తాయి. అలాగే ఉగాది రోజు చేసే ప్రతి పని ప్రభావం ఏడాది అంతా ఉంటుంది. అయితే ఉగాది రోజు ప్రత్యేకించి ఏ దేవుడిని పూజిస్తారో తెలుసా?
ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఈ రోజు నుంచి స్రుష్టి మొదలైందని నమ్ముతుంటారు. అందుకనే ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేస్తారు. అనంతరం ఉతికిన శుభ్రమైన దుస్తువులు ధరించి గడపకు పసుపు, కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలకు కడుతారు. ఇంటి ముందు రంగవల్లితో తీర్చిదిద్దుతారు. అయితే హిందువులు జరుపుకునే ప్రతి పండగకు ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలను అందుకుంటుంది.
ఈ నేపథ్యంలో ఉగాది రోజు ఏ దైవాన్ని పూజించాలనేది కొందరిలో సందేహం ఉంది. ఉగాది పండక్కి కాలమే దైవం. కాబట్టి ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తల్చుకుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అనంతరం వేపపువ్వుతో చేసిన ఉగాది పచ్చడి(Ugadi Pachadi) ని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. షడ్రుచులైన పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారంతో చేసిన ఉగాది పచ్చడిని ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ అందించాలి. ఈ ఉగాది పచ్చడికి వైద్య పరంగా విశిష్టమైన గుణం ఉంది. ఉగాది పచ్చడి వేసవి(Summer) లో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు జీవిత కష్ట సుఖాల కావడి కుండలు అని చెప్పడమే.
ఇది కూడా చదవండి: ఉగాది పచ్చడితో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?