ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది అనేక ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఖాతా తెరిచేటప్పుడు ఆధార్ సమాచారం, KYC అందించడం తప్పనిసరి అయింది. ఇది లేకుండా, మీ ముఖ్యమైన పనులు చాలా వరకు నిలిచిపోవచ్చు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని 12,000 మంది పిల్లలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి వారి స్కాలర్‌షిప్ మొత్తాన్ని అందుకోలేదు. ఎందుకంటే వారి బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేయలేదు. అటువంటి పరిస్థితిలో, దాని స్థితిని తనిఖీ చేయడం చాలా ముఖ్యం.
స్టేటస్ ఎలా తనిఖీ చేయాలి?
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక పోర్టల్ 'myAadhaar' ఈ పేజీకి వెళ్లడం ద్వారా మీ ఖాతాల్లో ఏయే ఆధార్‌తో లింక్ చేయబడిందో మీరు చెక్ చేసుకోవచ్చు. RBI నిబంధనల ప్రకారం, మీకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే, మీరు అన్ని ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడం అవసరం. మీరు దీన్ని తనిఖీ చేయాలనుకుంటే, ఈ కింద దశలను అనుసరించి చెక్ చేసుకోండి.
1. ముందుగా యూఐడీఏఐ UIDAI అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.
2. తర్వాత 'చెక్ ఆధార్/బ్యాంక్ లింకింగ్ స్టేటస్' ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
3. స్క్రీన్‌పై కొత్త బ్యాంక్ మ్యాపర్ పేజీ కనిపిస్తుంది.
4. ప్రత్యేక గుర్తింపు సంఖ్య (UID) లేదా వర్చువల్ IDని ఎంటర్ చేయాలి.
5. ఆ తర్వాత 'Send OTP' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
6. ఆ తర్వాత మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని ఎంటర్ చేయాలి.
7. చివరగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
8. ఇప్పుడు ఆధార్‌తో లింక్ చేలిన బ్యాంక్ అకౌంట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
mAadhaar యాప్ ద్వారా మీ ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఈ స్టేప్స్ ఫాలో అవ్వండి:
1. ముందుగా mAadhaar యాప్‌ని ఓపెన్ చేసి మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి.
2. ఇప్పుడు 'My Aadhaar' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. 'ఆధార్-బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
4. మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
5. తర్వాత 'రిక్వెస్ట్ OTP' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
6. మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేయండి.
7. ఆపై మీ బ్యాంక్ ఖాతా మీ ఆధార్‌తో లింక్ అయిందో లేదో చెక్ చేయడానికి 'వెరిఫై' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మొబైల్ ద్వారా ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్ ఇలా తెలుసుకోండి:
1. ఆధార్ కార్డ్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి USSD కోడ్‌ను డయల్ చేయడం ద్వారా ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
2. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్‌ని చెక్ చేయడానికి మార్గాలు
3. UIDAIతో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌తో *99*99*1# డయల్ చేయాలి.
4. మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
5. మీరు మీ ఆధార్ నంబర్‌ను మళ్లీ నమోదు చేయాలి.
6. తర్వాత సెండ్ బటన్‌పై క్లిక్ చేయండి.
7. బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అయిన స్టేటస్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: కార్తీక మాసంలో యాదాద్రికి వెళ్తున్నారా? అయితే… ఈ వివరాలు మీ కోసమే..!!