నిద్రపోతున్న నిర్లక్ష్యపు ప్రభుత్వం లేసేది ఎప్పుడు..?

బీఆర్ఎస్‌పై బండి సంజ‌య్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో శాంతి భ‌ద్రతలు క్షీణించాయ‌ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైద‌రాబాద్‌లో ఒకే రోజు 5 హత్యలు చోటు చేసుకున్నాయని.. ఇన్ని దారుణ హ‌త్య జ‌రుగుతున్న బీఆర్ఎస్ మాత్రం నిద్రపోతుందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
నిద్రపోతున్న నిర్లక్ష్యపు ప్రభుత్వం లేసేది ఎప్పుడు..?

When will the sleeping negligent government wakeup

ఇప్పటికైనా నిద్ర లేవండి సారూ..

బీఆర్ఎస్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్రతలు క్షీణించాయ‌ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న హైద‌రాబాద్‌లో ఒకే రోజు 5 హత్యలు చోటు చేసుకున్నాయని.. నిన్న సూర్యాపేటలో పట్టపగలే దారుణ హ‌త్య జ‌రిగింద‌ని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పోలీసులు నిద్ర పోతున్నారా అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో ఈ హత్యలను చూస్తూంటేనే అర్థమవుతుందనన్నారు.

ట్విట్టర్ టిల్లు ఎక్కడ..

ట్విట్టర్‌లో 24 గంటలు టైం పాస్ చేసే మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఆయ‌న‌కు మ‌రో పేరు కూడా త‌గిలించారు. అదేనండి ట్విట్టర్ టిల్లు ఏం చేస్తున్నాడ‌ని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అస‌లు తెలంగాణ‌లో హోం శాఖ మంత్రి ఉన్నారా అనే అనుమానం కలుగుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇంతకు ప్రతి శాఖకు మంత్రి ఉన్నా లేనట్టేనని పేర్కొన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు

అంద‌రి మంత్రుల త‌ర‌పున మంత్రి కేటీఆర్ మాత్రమే మాట్లాడుతార‌ని, సీఎం ఏమైనా అన్ని శాఖ‌ల‌ను ఆయ‌న‌కే అప్పగించారా అనే అనుమానం కలుగుతుందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న వ‌రుస సంఘ‌ట‌న‌ల‌పై తాము ఎప్పటికప్పుడు తెలంగాణ డీజీపీకి చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బండి ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇట్లా అయితే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ వరుస హత్యలు చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు