Retirement Schemes: రిటైరయ్యాక ఎవరి పంచనా చేరక్కర్లేదు..ఈ స్కీమ్స్‎లో పెట్టుబడి పెడితే చాలు..!!

పదవీ విరమణ వయస్సులో ఆరోగ్యంతోపాటు, ఆర్థిక వనరులు కూడా చాలా ముఖ్యమైనవి. వీటిని అనేక పెట్టుబడుల ద్వారా సమకూర్చుకోవచ్చు. ఈరోజు ఐదు ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుందాం. వీటిలో పెట్టుబడి పెట్టినట్లయితే అధిక వడ్డీ మీకు అందుతుంది. అంతేాదు ఈ పథకాలలో కొన్నింటిపై పన్ను ప్రయోజనాలను కూడా పొందుతారు.

Retirement Schemes: రిటైరయ్యాక ఎవరి పంచనా చేరక్కర్లేదు..ఈ స్కీమ్స్‎లో పెట్టుబడి పెడితే చాలు..!!
New Update

Best Retirement Schemes: వృద్ధాప్యంలో సన్నిహితుల నుంచి సహకారం అవసరమని అంటారు. మీకు వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసుకునే ఆప్తులు ఉంటే... వృద్ధాప్యం సులభంగా దాటిపోతుంది. కానీ ఈ రోజుల్లో, డబ్బు కంటే ఎవరూ ముఖ్యం కారనే ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ముఖ్యంగా వృద్ధాప్యంలో చేతులు నాలుగు పైసలు ఉంటేనే ఎవరైనా అక్కున చేర్చుకుంటారు. వృద్ధాప్యంలో ఎవరి పంచనా చేరకుండా ఉండేందుకు మీరు పదవీవిరమణ తర్వాత ఈ స్కీంలలో పెట్టుబడి పెట్టినట్లయితే నెలా నెలా డబ్బును పొందవచ్చు.

LIC సరళా పెన్షన్ పథకం (LIC Saral Pension Scheme):
దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీకి చెందిన ఈ పెన్షన్ పథకం మీ పదవీ విరమణ ప్రణాళికకు మంచి ఎంపిక. 40 నుంచి 80 ఏళ్ల లోపు వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. పాలసీని కొనుగోలు చేసిన 6 నెలల తర్వాత మాత్రమే పాలసీని సరెండర్ చేసే సౌకర్యం మీకు అందిస్తుంది. పాలసీదారు మరణిస్తే, పెట్టుబడి మొత్తం అతని నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది. ఈ పథకంలో, మీరు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రీమియం చెల్లించాలి, ఆ తర్వాత మీరు ప్రతి నెలా, లేదా ప్రతి మూడు నెలలకోసారి లేదా ప్రతి ఆరు నెలలకోసారి లేదా వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని బట్టి మీకు పెన్షన్ ఇస్తారు. 42 ఏళ్ల వ్యక్తి రూ.30 లక్షల వార్షికాదాయం కొనుగోలు చేస్తే, అతనికి ప్రతి నెలా రూ.12,388 పెన్షన్ వస్తుంది.

ఇది కూడా చదవండి: చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలి కేబినెట్‌ భేటీ.. జగన్‌ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

జాతీయ పెన్షన్ పథకం (National Pension Scheme):
జాతీయ పెన్షన్ పథకం (NPS) అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క సామాజిక భద్రతా కార్యక్రమం. ఈ పెన్షన్ ప్రోగ్రామ్ సాయుధ దళాలు మినహా ప్రభుత్వ, ప్రైవేట్, అసంఘటిత రంగాల ఉద్యోగులకు కూడా అందుబాటులో ఉంటుంది. 18 నుండి 70 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఈ పథకంలో పన్ను ప్రయోజనాలను పొందుతారు.

ప్రధాన మంత్రి వయ వందన యోజన(Pradhan Mantri Vaya Vandana Yojana):
ప్రధాన్ మంత్రి వయ వందన యోజన అనేది దేశంలోని సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను అందించే బీమా పాలసీ-కమ్-పెన్షన్ పథకం. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన 10 సంవత్సరాలపాటు నిర్దేశిత రేటుతో హామీతో కూడిన పెన్షన్‌ను అందిస్తుంది. ఈ పథకం సంవత్సరానికి 7.4 శాతం హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. ఈ పథకం కింద ప్రతి నెలా రూ.పది నుంచి పదివేల వరకు పెన్షన్ తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: పరువు పోగొట్టుకున్న కెనడా..మండిపడుతున్న అగ్రదేశాలు..!!

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizen Savings Scheme):
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేది 60 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం ప్రభుత్వం-ప్రాయోజిత పొదుపు పథకం. మీరు ఇందులో ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసి, ఆపై మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. ఈ పథకంలో మీకు 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. పెట్టుబడిదారులు కేవలం రూ. 1,000తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు.

అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojna):
అటల్ పెన్షన్ యోజనలో 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు.

#senior-citizen-savings-scheme #retirement-schemes #nps #national-pension-scheme #atal-pension-yojna #5-best-retirement-schemes #best-retirement-schemes #lic-sarla-pension-scheme #pradhan-mantri-vaya-vandana-yojana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి