చీకటి పడితే చాలు రోడ్లపైకి విష సర్పాలు.. అధికారులు స్పందించాలి

విష స‌ర్పాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌. వర్షాకాలం వచ్చిందంటే పాముకాటు బాధితులు పెరుగుతారు. ఇంటి పరిసరాల్లో అపరిశుభ్రత ఉండటంతో విషసర్పాలకు ఆవాసాలుగా మారుతాయి. అంతేకాదు మన చుట్టూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే లైటింగ్‌ ఉండేలా చూసుకోవాలి. కానీ కాకినాడ జిల్లా పత్తిపాడులో దీనికి విరుద్ధంగా ఉంది. రోడ్డుపై వివిధ రకాల పాములు వచ్చి అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. కత్తిపూడిలో 12 అడుగుల కొండచిలోను హతమార్చారు కొండవారిపేట కాలనీవాసులు. కనీసం ఇప్పుడైనా మా బాధను అర్థం చేసుకొని లైట్లు ఏర్పాటు చేయాలని వారు వేడుకుంటున్నారు.

New Update
చీకటి పడితే చాలు రోడ్లపైకి విష సర్పాలు.. అధికారులు స్పందించాలి

When it gets dark in Kakinada district venomous snakes enter the roads
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి

వర్షాకాలం వచ్చిందంటే పాముకాటు బాధితులు పెరుగుతారు. ఇంటి పరిసరాల్లో అపరిశుభ్రత ఉండటంతో విషసర్పాలకు ఆవాసాలుగా మారుతాయి. నీటి నిల్వ గుంతలు, చెట్ల పొదలు మన ఇండ్ల చుట్టూ ఉండటం వల్ల పురుగులు, కప్పలు, ఎలుకలు ఎక్కువగా చేరుతుంటాయి. ఇక ఇవి ఉన్నచోటికి సర్వ సాధారణంగా పాములు వస్తుంటాయి. అందుకే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ఇంటి చుట్టూ వర్షాల కారణంగా పెరిగిన మొక్కలను గడ్డిని ఎప్పటికప్పుడు తొలగించాలి. ఎండకాలం పరిసరాలు శుభ్రంగానే ఉంటాయి. గడ్డి, కలుపు మొక్కలు పెరగటానికి ఆ స్కారం ఉండదు. జూలై మాసం నుంచి సెప్టెంబర్‌ వరకు వర్షాకాలం కావడంతో వర్షా లు ఎక్కువగా పడి నీరు నిల్వ ఉండటం, దాని మూలంగా పిచ్చిచెట్లు, ఇతర మొక్కలు విపరీతంగా పెరిగి పరిసరాలు మొత్తం కమ్ముకుంటాయి. వర్షాకాలం ఈదురు గాలుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా సరిగా ఉండకపోవడం కూడా పాములు వచ్చి కాటు వేయటానికి ఆస్కారం ఉంటుంది.

When it gets dark in Kakinada district venomous snakes enter the roads

12 అడుగుల కొండచిలువ కలకలం

అయితే కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో చీకటి పడితే చాలు రోడ్లపైకి విష సర్పాలు వస్తున్నాయి. శంఖవరం మండలం కత్తిపూడిలో 12 అడుగుల కొండచిలువను హతమార్చిన కొండవారిపేట కాలనీవాసులు. రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్ళటాన్ని చూసిన యువకుడు.. స్ధానికులకు సమాచారం ఇచ్చి కర్రతో కొట్టి చంపిన్నారు. కాలనీలలో వీధి దీపాలు లేకపోవడంతో ఇక్కట్లు గురవుతున్న కాలనీవాసులు వాపోతున్నారు. తరచూ విషసర్పాలు సంతరిస్తున్నాయని పలుసార్లు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన.. వీధీ దీపాలు వెయ్యమని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన నాయకులు గాని.. అధికారులు కానీ స్పందించడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు. భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నామని తమ గోడును వెళ్లిబుచ్చారు కాలనీవాసులు. ఇదే రహదారి గుండా నిత్యం చిన్న పిల్లల సైతం రాకపోకలు చేస్తున్నారని చెబుతున్నారు స్థానికులు.

వేల రకాలైన పాములు

అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 50లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశం చూసినట్లయితే ప్రతీ ఏటా 2 లక్షల మంది పాముకాటుకు గురైతే అందులో 50వేల మంది చికిత్స అందకపోవడంతో మృతిచెందుతున్నారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా 3వేల రకాలైన పాములున్నప్పటికీ వాటిలో సుమారు 350రకాలు మాత్రమే విష పూరితమైనవి. వీటిలో కట్లపాము, తాచుపాము, నాగత్రాచు, సముద్ర సర్పం, రక్తపెంజర అతిప్రమాదకరమైనవి. వీటిలో కట్లపాము, నాగుపాము, తాచుపాము కాటేస్తే వీటి విషం నేరుగా కేంద్ర నాడీ మండలం, ఊపరితిత్తులపై పని చేస్తోంది. హృదయ స్పందన ఆగి వెనువెంటనే మరణం సంభవిస్తుంది. రక్తపింజర విషం ఎక్కువగా రక్త నాళాలపై ప్రభావం చూపుతుంది. రక్తనాళాలు చిట్లి నోటి నుంచి రక్తం వస్తుంది. రక్త నాళాల్లో రక్తప్రసరణ ఆగిపోతుంది. రక్తం గడ్డ కట్టడం వలన కాటుకు గురైన వ్యక్తి మరణిస్తాడని వైద్యులు వెల్లడించారు.

వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి

పాముకాటు వేసిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి కానీ చాలా మంది ముఢనమ్మ కాలతో మంత్రగాళ్లను ఆశ్రయిస్తారు. పాముల్లో చాలా వాటికి విషం ఉండదు ఇవి కాటువేసిన వెంటనే పెద్దగా ప్రమాదం ఉండదు. అలాగే దుస్తులపై నుంచి పాముకాటు వేసినప్పుడు కూడా ప్రభావం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మంత్రగాళ్ల వద్దకు తీసుకెళ్లే కొందరు బతుకుతారు. వారే బతికించారని భ్రమపడుతారు. విష సర్పాలు కాటేసినప్పుడు. వైద్యుడిని సంప్రదించాలి త్వరగా దవాఖానకు తీసుకెళ్లితే ప్రాణాలతో బయటపడొచ్చు ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు