Sankranti 2024 : సంక్రాంతి పండుగ ఎప్పుడు 14న లేక 15న? ఏ సమయంలో జరుపుకోవాలి? పండితులు చెబుతున్నది ఇదే..!! జనవరి 15వ తేదీ సోమవారం తెల్లవారుజామున 2.54నిముషాలకు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ లెక్కన సంక్రాంతి పండగను 15వ తేదీని జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. జనవరి 14న భోగి, జనవరి 16న కనుమ ఉంటాయని తెలిపారు. By Bhoomi 12 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Sankranti 2024: ప్రతిఏడాది సంక్రాంతి పండుగ రాగానే..ఏ రోజు జరుపుకోవాలన్న ప్రశ్న చాలా మంది వేధిస్తుంది. దీనికి సంబంధించి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దీనిపై పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మనదేశంలో చాలా పండుగలు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కరోజు ముందుగానే జరుపుకుంటారు. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం మర్నాడు జరపుకుంటారు. దీనికి చంద్రమానం, కేలండర్లు లెక్కలే కారణం. మరి ఈ ఏడాది 2024లో సంక్రాంతి పండగను జనవరి 14న జరుపుకోవాలా? లేదంటే జనవరి 15న జరుపుకోవాలా? అనే సందేహం చాలా మందిలో ఉంది. దానికి పండితులు కొన్ని సూచనలు చెబుతున్నారు. దృక్ గణితాన్ని (Visual mathematics)ఫాలో అయ్యే వాళ్లు 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అదే పూర్వ గణిత పంచాంగం(Purva Mathematical Almanac) ఆచరించేవారు 14వ తేదీని భోగి, 15వ తేదీని సంక్రాంతి, 16వ తేదీన కనుమ పండుగలను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.టీటీడీ(TTD), శ్రీశైలం దేవస్థానం(Srisailam Devasthanam) పండితులు పూర్వ గణిత పంచాంగం ప్రకారం సంక్రాంతి పండగను జరుపుకోవాలని సూచిస్తున్నారు. సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలి? సంక్రాంతి పండుగను ఎప్పుడు జరుపుకోవాలనే ప్రశ్నకు పండితులు రెండు రకాలుగా సమాధానాలు చెబుతున్నారు. కొందరు 14న అని చెబుతే..ఇంకొందరు 15న అని చెబుతున్నారు. దీంతో ఏరోజు జరుపుకోవాలనేది ప్రజల్లో గందరగోళం ఉంది. ప్రపంచవ్యాప్తంగా దృక్ గణితాన్ని పాటిస్తున్నారు. ఆ ప్రకారంగా చూస్తే జనవరి 14న సంక్రాంతి జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా జనవరి 14న సంక్రాంతి సెలవు ప్రకటించింది. భారత పంచాంగ సిద్ధాంతం ప్రకారం జనవరి 14వ తేదీన సంక్రాంతి జరుపుకోవాలని చెబుతోంది. అయితే సంక్రాంతి నాడు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రకారంగా చూసినట్లయితే..సూర్యుడు జనవరి 15న సోమవారం తెల్లవారుజామున 2.54 నిమిషాలకు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ లెక్కన చూసినట్లయితే..సంక్రాంతి జనవరి 15న జరుపుకోవచ్చు. దీని ప్రకారం చూస్తే..జనవరి 14న భోగి, జనవరి 16న కనుమ ఉంటాయి. ఇది కూడా చదవండి: శ్రీశైలం వెళ్లే ప్లాన్ లో ఉన్నారా?మీకు శుభావార్త..ఏంటంటే..? #makar-sankranti #sankranti-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి