WhatsApp: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌..అలా స్టేటస్ పెట్టగానే..ఇలా అలర్ట్..!

యూజర్ల ప్రైవసీని గోప్యంగా ఉంచుతూనే అధునాతన ఫీచర్లను పరిచయం చేస్తోంది వాట్సాప్. వాతాజాగా వాట్సాప్ స్టేటస్ విభాగంలో ఓ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను తీసుకువస్తుందని తెలుస్తోంది. కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లు స్టేటస్ పెట్టగానే మీకు అలర్ట్ వచ్చే ఫీచర్ పై పనిచేస్తోంది.

Whats App: అలా అయితే ఇండియా నుంచి వెళ్ళిపోతాం..వాట్సాప్
New Update

WhatsApp New Update : స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారనడంలో ఎలాంటి అనుమానం లేదు. మార్కెట్లోకి ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చినా ..వాట్సాప్ కు మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ యాప్ ను యూజ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తూ యూజర్లను ఆకట్టుకోవడమే ఈ యాప్ కు ఇంతటి క్రేజ్ దక్కిందని చెప్పవచ్చు. ఓ వైపు యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూనే మరోవైపు లేటెస్టు ఫీచర్లను పరిచయం చేస్తోంది. వాట్సాప్ తీసుకువచ్చిన ఫీచర్లలో వాట్సాప్ స్టేటస్ (WhatsApp Status Alert) గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ ఫీచర్ కు ఎంతో ఆదరణ లభించింది. అయితే తాజాగా వాట్సాప్ ఈ స్టేటస్ విభాగంలో ఓ ఇంట్రెస్టింగ్ తీసువస్తున్నట్లు సమాచారం. సాధారణంగా మనం కాంటాక్ట్ జాబితాలో ఎవరైనా స్టేటస్ పెడితే అప్డేట్స్ లోకి వెళ్లి చేస్తే కానీ తెలియదు.

ఇది కూడా చదవండి: జొమాటోలో బిగ్ సర్వీస్..ఒకేసారి 50 మందికి సరిపడా ఫుడ్ డెలివరీ..!

అలా కాకుండా మీ కాంటాక్టు లిస్టులో ఉన్నవారు స్టేటస్ పెట్టగానే మీకు అలర్ట్ వస్తే ఎలా ఉంటుంది? వాట్సాప్ ప్రస్తుతం ఇదే ఫీచర్ పై పనిచేస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీజర్ ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఏదైనా మెసేజ్ వస్తే ఎలా అయితే అప్ డేట్ వస్తుందో ఇక పై ఎవరైనా స్టేటస్ పెట్టినా మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఇది యూజర్స్ యాక్టివిటీ, కనెక్టివిటీని పెంచుతుందని కంపెనీ భావిస్తుందని సమాచారం. మొదట ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత ఇతర యూజర్లకు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది.

ఇక వాట్సాప్ ఏఐ (WhatsApp AI) సేవలను కూడా ప్రారంబించింది. మెటా ఏఐ (Meta AI) పేరుతో ఓ చాట్ బాట్ ను ప్రవేశపెట్టింది. ఈ చాట్ బాట్ అచ్చంగా చాట్ జీపిటీ వలే పనిచేస్తుంది. ఇందులో యూజర్లు తమ సందేహాలను తీర్చుకోవచ్చు. ఏ అంశానికి సంబంధించిన ప్రశ్న అడిగిన వెంటనే చాట్ బాట్ సమాధానం ఇస్తుంది.

#whatsapp #whatsapp-status
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe